Monday, April 29, 2024
- Advertisement -

డీకే అరుణ బీజేపీనా..కాంగ్రెస్సా!

- Advertisement -

తెలంగాణ బీజేపీ సీనియర్ నేత డీకే అరుణ పరిస్థితి అడకత్తెరలో పొకచెక్కలా తయారైంది. ప్రస్తుతం బీజేపీలో ఉన్న డీకే అరుణ…హైకోర్టు తీర్పుతో ఎమ్మెల్యేతో మారిపోయింది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై అనర్హత, హైకోర్టు అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది న్యాయస్థానం. ఇది డీకే అరుణకు కాస్త ఊరట కలిగించిన అంశమే అయిన ఆమెకు మాత్రం మింగుడు పడటం లేదు.

ఎందుకంటే గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి పోటీ చేసిన డీకే అరుణ..బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డిపై ఓటమి పాలైంది. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీలో చేరారు. అయితే తాజాగా ఆమెను ఎమ్మెల్యేగా కోర్టు ప్రకటించినా ఆమె ఎన్నిక అంత సాఫీగా కనిపించడం లేదు. ఎందుకంటే ఆమె పోటీ చేసింది కాంగ్రెస బీ ఫామ్‌పై…ప్రస్తుతం ఉంది బీజేపీలో. ఇదే అంశాన్ని ప్రస్తావించి బీఆర్ఎస్ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే పనిలో ఉండటంతో ఈ అంశం ఇప్పట్లో తేలేలా కనిపంచడం లేదు.

ఇక డీకే అరుణ కుటుంబం గద్వాలలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఉంది. ఆమె భర్త డేకే కుటుంబం అక్కడ చెప్పిందే శాసనం. ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరిగితే 10 సార్లు డీకే కుటుంబమే విజయం సాధించింది. డీకే సత్యారెడ్డి మూడుసార్లు, ఆయన పెద్ద కుమారుడు డీకే సమరసింహారెడ్డి రెండుసార్లు, చిన్న కుమారుడు భరత సింహా రెడ్డి ఒకసారి, భరతసింహారెడ్డి భార్య అరుణ మూడుసార్లు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న కృష్ణమోహన్‌రెడ్డి.. భరతసింహా రెడ్డికి మేనల్లుడే. ఇక డీకే అరుణ 2004లో స్వతంత్రంగా, 2009, 2014లో కాంగ్రెస్ తరఫున విజయం సాధించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -