Sunday, May 5, 2024
- Advertisement -

కన్ఫామ్..కాంగ్రెస్‌లోకి ఈటల అండ్ కో!

- Advertisement -

ఏపీ కంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముందుగా జరగనుండటంతో రాజకీయాలు రోజురోజుకి కొత్త మలుపు తిరుగుతున్నాయి. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలంతా పక్క పార్టీల వైపు చూస్తున్నారు. అయితే ఇక ప్రధానంగా ఎన్నికల రేసులో వెనుకబడిపోయింది బీజేపీ. బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ ప్రకటించగా కాంగ్రెస్ పార్టీ రోజుకో హడావిడితో వార్తల్లో నిలుస్తోంది. అయితే బీజేపీలో మాత్రం ఏ చలనం లేదు. ఆ పార్టీకి అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్ధులు లేకపోవడంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఫుల్ లిస్ట్ ప్రకటించాక ఈ రెండు పార్టీల అసంతృప్తులను తమ పార్టీలో చేర్చుకుని లీస్ట్ ప్రకటించాలని భావిస్తోన్నట్లు సమాచారం.

అయితే ఇంతవరకు బాగానే ఉన్నా ఎన్నికల సమరంలో వెనుకబడిపోతున్నామనే భావనలో ఆ పార్టీ నేతలు ఉన్నారు. అంతేగాదు పలువురు సీనియర్ నేతలు ముఖ్యంగా కాంగ్రెస్,బీఆర్ఎస్ నుండి బీజేపీలో చేరిన నేతలు కాషాయాన్ని వీడి హస్తం గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నారట. ఇదే ఈ విషయాన్ని ఆ పార్టీ నుండి సస్పెండ్ అయిన యెన్నం శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఈటలతో పాటు సీనియర్ నేతలంతా కాంగ్రెస్ పార్టీ ముఖ్యులతో పలుమార్లు భేటీ అయ్యారని శ్రీనివాస్ రెడ్డి చెప్పడం బీజేపీ నేతలకు మింగుడుపడటం లేదు. అంతేగాదు ఆ భేటీ తాను కూడా ఉన్నానని చెప్పడంతో ఒక్కసారిగా బీజేపీ నేతలంతా ఖంగుతిన్నారు.

దీంతో కొంతకాలంగా ఈటలతో పాటు కోమటిరెడ్డి,రఘునందన్ పార్టీ మారుతారు అన్న ప్రచారానికి బలం చేకూరినట్లైంది. అలాగే యెన్నం శ్రీనివాస్ రెడ్డితో పాటు ఏనుగు రవీందర్ రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నారు. ఇక ఈటల అండ్ బ్యాచ్ మాత్రం కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. అన్ని కుదిరితే ఈ నెల 17 కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోయే భారీ బహిరంగసభలో చేరనున్నట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం. ఇక ఇదే సభలో వైఎస్‌ఆర్‌టీపీనీ తన పార్టీలో షర్మిల సైతం విలీనం చేయనున్నట్లు సమాచారం. ఇదే గనుక జరిగితే హస్తం పార్టీలో జోష్ రావడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -