Thursday, May 16, 2024
- Advertisement -

వైకాపా రాజ్యసభ అభ్యర్థితో బాబు బేరసారాలు…..

- Advertisement -

వాహ్……. ఇది కదా రాజకీయం. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని……గొప్పలకే గొప్ప అని……నిజాయితీకే బ్రాండ్ అంబాసిడర్ అని……..మహాత్మాగాంధీకంటే గొప్పవాడని……..ఎన్టీఆర్‌ చిటికెన వేలు పట్టుకుని నడిపించిన వాడని ఒకవైపు పూనకం వచ్చినట్టుగా ప్రచారం చేసుకుంటూపోతున్నారు.

అదే టైంలో తెర వెనుక జరిగిన వ్యవహారం ఏంటో తెలుసా? వైసీపీకి రాజ్యసభ సీటు దక్కకూడదు అని కుట్రలు చేస్తున్న చంద్రబాబు అండ్ కో వైకాపా అభ్యర్థి వేంరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి టచ్‌లోకి వెళ్ళారట. వేంరెడ్డి ప్రభాకరరెడ్డి 2014వైకాపాకే మద్దతిచ్చాడు. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టిడిపి వేంరెడ్డిని టిడిపిలో చేర్చుకుంది. కానీ వేంరెడ్డి మాత్రం ఎక్కువకాలం అక్కడ ఇమడలేకపోయాడు. చంద్రబాబు తీరు నచ్చని వేంరెడ్డి మళ్ళీ జగన్ పార్టీలోనే చేరాడు. వైఎస్‌కి అత్యంత సన్నిహితుడు అయిన వేంరెడ్డికి రాజ్యసభ టికెట్ ఇచ్చాడు జగన్. వేంరెడ్డికి ఉన్న మంచిపేరు దృష్ట్యా బిజెపి ఎమ్మెల్యేలు, అవసరమైతే టిడిపిలో అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా వేంరెడ్డికి మద్దతు ఇస్తారని బాబు భయం. వేంరెడ్డికి ప్రత్యర్థిగా నిలిచే సరైన అభ్యర్థి దొరక్కపోవడంతో టిడిపి జనాలు వేంరెడ్డికి టచ్‌లోకి వెళ్ళారట. అవసరమైతే టిడిపితో పాటు బిజెపి ఓట్లు కూడా వేయిస్తాం… ప్రత్యర్థిని కూడా పోటీకి నిలపం…..కానీ గెలిచిన వెంటనే టిడిపిలోకి వచ్చెయ్యాలి అని కండిషన్ పెట్టారట. అంతా విన్న వేంరెడ్డి ప్రభాకరరెడ్డి…….‘అసలు నేను టిడిపిని వదిలి వచ్చిందే ఇలాంటి దగుల్బాజీ రాజకీయాలు చేయలేక….అధికారం కోసం సొంత వాళ్ళను చంపుకోవడాలు, ఎంతటి నీచానికైనా దిగజారడాలు లాంటివి నేను చెయ్యను…’ అని ఘాటుగా కౌంటర్ ఇచ్చాడట. వేంరెడ్డి ఉద్దేశ్యాలు, ఆయన మాటల్లోని శ్లేషను అర్థం చేసుకున్న పచ్చ బ్యాచ్ దెబ్బకు సైలెంట్ అయిపోయారట.

ఇప్పుడు ఈ మొత్తం విషయం తెలుసుకున్న సీనియర్ జర్నలిస్టులు బాబు రాజకీయాల గురించి రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఒకవైపు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ ధర్మరాజు, సత్యహరిశ్ఛంద్రుడులు కలిసి పుడితే నేను అనే స్థాయిలో చెప్పుకుంటున్న చంద్రబాబు…….తెరవెనుక మాత్రం ఎంతటి నీచ రాజకీయాలు అయినా చేసే స్థాయికి దిగజారి వ్యవహరిస్తుండడం చూసి భయాందోళనలకు గురవుతున్న స్థితిలో సాటి రాజకీయ నాయకులు ఉన్నారని సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -