Monday, May 5, 2025
- Advertisement -

చంద్రబాబు మనసులో ఏముంది ?

- Advertisement -

చంద్రబాబు రాజకీయాల్లో అపార చాణక్యుడిగా పేరు గాంచాడు. ఆయన తీసుకునే నిర్ణయాలు, రాజకీయ వ్యూహాలు, ప్రత్యర్థిని చిక్కుల్లో పెట్టె ఎత్తుకు పైఎత్తులు ఇవ్వన్ని కూడా అప్పుడప్పుడు బాబు చతురతకు అద్దం పడుతూ ఉంటాయి. అయితే గత ఎన్నికల్లో మాత్రం బాబు ప్రణాళికలను ఏపీ ప్రజలు తిప్పికొట్టారు. ఊహించని విధంగా తెలుగుదేశం పార్టీని కనీవినీ ఎరుగని రీతిలో ఓటమిపాలు చేశారు రాష్ట్ర ప్రజలు. దాంతో పార్టీ పునర్వభవం కోసం బాబు విశ్వ ప్రయత్నలే చేస్తున్నారు.

ఇక వచ్చే ఎన్నికల్లో కూడా టిడిపి ఓడిపోతే పార్టీ ఉనికిని కోల్పోయే అవకాశం ఉంది. దాంతో పార్టీని నిలబెట్టేందుకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో మళ్ళీ ఎన్డీయే కూటమితో చేతులు కలిపేందుకు బాబు ప్రయత్నాలు చేస్తున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై అటు టిడిపి శ్రేణులు గాని ఇటు బిజెపి నేతలు గాని ఎవరు స్పందించలేదు. అయితే తాజాగా ఇదే విషయంపై టిడిపి అధినేత చంద్రబాబు స్పందించారు.

ఇటీవల మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ” రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్రంతో తమ సంబంధాలు ఉంటాయని, గతంలో కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీయే నుంచి బయటకు వచ్చినట్లు ” చెప్పుకొచ్చారు. ఎన్డీయే తో టీడీపీ కలవబోతుందా ? అన్న ప్రశ్నకు.. అలా ప్రచారం చేస్తున్న వారినే అడగాలని ” బాబు దాటవేశారు. అయితే టీడీపీ ఎన్డీయే తో కలుస్తుందా ? లేదా అనేదానిపై మాత్రం బాబు ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా తన చేతురతను మరోసారి ప్రదర్శించారు. అయితే బాబు మాటలను బట్టి చూస్తే ఎన్డీయేతో కలిసిఎందుకు ఆసక్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read

జగన్ మాస్టర్ ప్లాన్.. నిన్న కుప్పం నేడు మంగళగిరి ?

మోడీ చెప్పేది ఒకటి.. చేసేది మరోటి!

కే‌సి‌ఆర్ కు ఘోర అవమానం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -