Saturday, April 20, 2024
- Advertisement -

మోడీ చెప్పేది ఒకటి.. చేసేది మరోటి!

- Advertisement -

ఇటీవల దేశ వ్యాప్తంగా ఉచితలకు సంబంధించిన చర్చ ఏ స్థాయిలో జరుగుతోందో అందరికీ తెలిసిందే. ” ఉచిత పథకాల వల్ల దేశాభివృద్ది ఆగిపోతుందని, వాటిని రద్దు చేయాలని ” ఇటీవల ప్రధాని మోడీ వ్యాఖ్యానించడంతో.. వీటికి సంబంధించిన ప్రతిపాదన సుప్రీం కోర్టు వరకు కూడా చేరుకున్న సంగతి కూడా తెలిసిందే. అయితే సుప్రీం కోర్టు కూడా ఉచితలపై స్పష్టమైన తీర్పు ఇవ్వలేకపోవడం గమనార్హం. ఉచితలు ఏవో, అనుచితలు ఏవో రాజకీయ పార్టీలే తేల్చుకోవాలని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుంటే చాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. మరి ఉచితలు వద్దని ఈ స్థాయి చర్చకు తెరతీసిన ప్రధాని మోడీ.. ఆయన ప్రభుత్వం ఉచితలు ఇవ్వడం లేదా ? అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి.

అంతే కాకుండా బీజేపీ అధికారంలో ఉన్న ఆయా రాష్ట్రాలలో కూడా ఉచిత పథకాలు అమలౌతూనే ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్ సి‌ఎం యోగి ఆదిత్యనాథ్.. 60 దాటిన మహిళలకు బస్సులలో ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఇటీవల హామీ ఇచ్చారు. ఇది ఉచితం కదా అని ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అలాగే హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ 125 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తామని తాజాగా ప్రకటించారు. ఇది కూడా ఉచితం కదా ? అంటూ ప్రశ్నిస్తున్నారు ఆయా పార్టీల నేతలు.

ఇలా బీజేపీ ప్రభుత్వాలు మాత్రం ప్రజలను ఆకర్శించేందుకు ఉచిత పథకాలు ప్రవేశ పెట్టవచ్చు కానీ ఇతర పార్టీల ప్రభుత్వాలు ఉచిత పథకాలు ప్రవేశ పెడితే తప్పా ? అనే ప్రశ్నలు వ్యక్తమౌతున్నాయి. దీన్ని బట్టి చూస్తే మోడీ చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి అనే భావన ప్రజల్లో బలంగా వ్యక్తమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే మోడీ ఉచిత పథకాలు వద్దనడం.. కేవలం కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసిన వ్యాఖ్యాలేనని మరి కొందరి అభిప్రాయం.

Also Read

కబలిస్తోన్న బీజేపీ..?

కే‌సి‌ఆరే మెయిన్ టార్గెట్ ?

పవన్ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అయ్యేనా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -