Friday, April 26, 2024
- Advertisement -

జగన్ మాస్టర్ ప్లాన్.. నిన్న కుప్పం నేడు మంగళగిరి ?

- Advertisement -

వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ క్లీన్ స్వీప్ చేయాలని వైఎస్ జగన్ టార్గెట్ గా పెట్టుకున్న సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టుగానే ఆయన ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ నేతలకు, కార్యకర్తలకు నియోజిక వర్గాలపై దృష్టి పెట్టేందుకు దిశ నిర్దేశం కూడా చేశారు. అయితే వైసీపీ 175 స్థానాల్లో సత్తా చాటలంటే ముందుగా ప్రత్యర్థి పార్టీ అయిన టిడిపి బలంగా ఉన్న నియోజిక వర్గాల్లో దెబ్బకొట్టాల్సి ఉంటుంది. అప్పుడే టిడిపి బలహీన పడి వైసీపీ బలం పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం జగన్ ఇదే ప్రణాళికను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముంఖ్యంగా టీడీపీ కంచుకుటలే జగన్ ప్రధాన లక్ష్యం అనే సంగతి ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలను బట్టి స్పష్టంగా అర్థమౌతోంది.

ముఖ్యంగా చంద్రబాబు నియోజిక వర్గం అయిన కుప్పంలో వైసీపీ జెండా ఎగురవేయాలని జగన్ దృఢనిశ్చయంతో ఉన్నాడు. ఇదే విషయాన్ని జగన్ పలు మార్లు స్పష్టం చేశాడు కూడా. ఇక ఇటీవల కుప్పంలో బాబు పర్యటనలో చోటు చేసుకున్నా పరిణామాలను బట్టి చూస్తే జగన్ కుప్పంపై ఎంతల ఫోకస్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక జగన్ ఫోకస్ చంద్రబాబు తనయుడు లోకేష్ పోటీ చేసే మంగళగిరి పై పడినట్లు తెలుస్తోంది. నారా లోకేష్ గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలు అయిన సంగతి తెలిసిందే. అయినప్పటికి లోకేష్ వచ్చే ఎన్నికల్లో కూడా మంగళగిరి నుంచి పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దాంతో లోకేష్ కు చెక్ పెట్టిందుకు జగన్ మాస్టర్ ప్లాన్ వేశాడట. అందులో భాగంగానే మంగళగిరిలోని టీడీపీ కీలక నాయకులను వైసీపీ వైపు ఆకర్శించేందుకు ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టారు.

ఇప్పటికే టీడీపీ కీలక నేత గంజి చిరంజీవి టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇంకా మరికొంత మంది టీడీపీ నాయకులు కూడా వైసీపీలో చేరే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇక పోతే ప్రస్తుతం మంగళగిరిలో వైసీపీ జెండానే ఎగురుతున్నప్పటికి వచ్చే ఎన్నికల్లో కూడా మెజారిటీ ఓటింగ్ రాబట్టుకునేందుకు జగన్ ప్రణాళికలు వేస్తున్నారు. అందులో బాగంగానే చేనేత సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న మంగళగిరిలో అదే సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవిని వచ్చే ఎన్నికల్లో వైసీపీ బరిలో దించే అవకాశాలు ఉన్నాయి. గంజి చిరంజీవి 2014 ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయినప్పటికి 2019 ఎన్నికల్లో ఆ సీటును లోకేష్ కు త్యాగం చేశారు. ఇక ప్రస్తుతం ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరడంతో లోకేష్ కు పోటీగా గంజి చిరంజీవినే వైఎస్ జగన్ రంగంలోకి దించుతారని పలువురి వాదన. ఇదే గనుక జరిగితే లోకేష్ మంగళగిరి వదులుకొని వేరే నియోజికవర్గం చూసుకోవాల్సిందేనని కొందరి అభిప్రాయం.

Also Read

పవన్ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అయ్యేనా ?

కే‌సి‌ఆరే మెయిన్ టార్గెట్ ?

కబలిస్తోన్న బీజేపీ.. ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -