Tuesday, May 6, 2025
- Advertisement -

పోరాడతారా.. ఇంటికే పరిమితం అవుతారా ?

- Advertisement -

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు కేవలం ఒకటిన్నర సంవత్సరాలే ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల సమరానికి సిద్దమయ్యాయి. నిత్యం ఏదో ఒకవిధంగా ప్రజల్లో ఉండేందుకే ప్రణాళికలు రచిస్తున్నాయి. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఎందుకంటే ఈసారి ఎన్నికలు టీడీపీ కి చాలా కీలకం కానున్నాయి. అందువల్ల టీడీపీ అధినేత చంద్రబాబు నిత్యం ప్రజల్లో ఉంటూ గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్నారు.

అయితే చంద్రబాబు మాటతీరులో గతంలో కంటే ప్రస్తుతం చాలా వైవిధ్యం కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎంతో అగ్రేస్సివ్ గా స్పీచ్ లు ఇస్తూ వైఎస్ జగన్ కు చెక్ పెట్టె ప్రయత్నం చేస్తున్నారు. ఇక తాజాగా గుంటూరు టీడీపీ ప్రధాన రాష్ట్ర కార్యలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆయన మాటతీరులో ఉన్న అగ్రేస్సివ్ స్పష్టంగా కనిపిస్తుంది. ” ఎన్నికలకు కేవలం ఒకటిన్నర సంవత్సర కాలమే ఉందని అందువల్ల నాయకులు బద్దకం విడిచి ప్రజల్లో తిరగాలని ” పిలుపునిచ్చారు. అంతే కాకుండా ” మీరు ఇంట్లో ఉంటో ఎన్నికల్లో కూడా ఇంటికే పరిమితం అవుతారని ” టీడీపీ శ్రేణులను బాబు హెచ్చరించారు.

జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో స్పష్టమైన వ్యతిరేకత కనిపిస్తోందని, ఎన్నికల్లో జగన్ పీడ వదిలించుకునేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని, అందువల్ల ఎన్నికలు ఎప్పుడు వచ్చిన సిద్దంగా ఉండాలని.. బాబు దిశానిర్దేశం చేశారు. అందువల్ల బద్దకం విడిచి ప్రజల్లో తిరిగేందుకు ఆసక్తికనబరచాలని, ఒకవేళ మీరు పోరాడలేకపోతే పోరాడేవారికి అవకాశం ఇవ్వండని చంద్రబాబు టీడీపీ నేతలకు చురకలు అంటించారు. ” క్విట్ జగన్ .. సేవ్ ఆంద్రప్రదేశ్ ” అనేది మన నినాదం కావాలని బాబు చెప్పుకొచ్చారు. మరి బాబు మాటల్లో ఉన్న ఈ అగ్రేస్సివ్ నెస్ చేతల్లో ఎంతవరకు కనబరుస్తారో చూడాలి.

Also Read

పేద విద్యార్థులపై.. ఇంత నిర్లక్ష్యమా !

రాష్ట్రనికి మూడు రాజధానులైతే.. దేశానికి ఐదు రాధానులు !

మోడీ ఆర్‌ఎస్‌ఎస్ కు దురమౌతున్నారా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -