Friday, April 26, 2024
- Advertisement -

మోడీ ఆర్‌ఎస్‌ఎస్ కు దురమౌతున్నారా ?

- Advertisement -

బీజేపీ ని ఆర్‌ఎస్‌ఎస్ నూ వేరువేరుగా చూడలేమంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆర్‌ఎస్‌ఎస్ ఐడియాలజీకి బీజేపీ హిందుత్వ వాదానికి చాలా దగ్గరి పోలికలు ఉంటాయి. అందువల్ల ఈ రెండు కూడా ఏకీకృతంగా ముందడుగు వేస్తూ జాతీయ రాజకీయాల్లో ఇతర పార్టీలకు కొరకరాని కొయ్యగా మారాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఆర్‌ఎస్‌ఎస్ కు మోడీ దురమౌతున్నారా ? అనే ప్రశ్నలు వ్యక్తమౌతున్నాయి. ఎందుకంటే ఆర్‌ఎస్‌ఎస్ అగ్రనాయకత్వానికి అత్యంత సన్నిహితుడు అయిన నితిన్ గడ్కారీని బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ లో స్థానం కల్పించకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. సాధారణంగా పార్టీ సీనియర్ నేతలకు బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ లో సభ్యత్వం కల్పిమించడం ఆనవాయితీగా వ్యవహరిస్తూ వస్తోంది.

అయితే గడ్కారీ విషయంలో మాత్రం ఈ ఆనవాయితీకి బ్రేక్ పడింది. ఊహించని విధంగా ఆయనను మోడీ అమిత్ షా ద్వయం పక్కన పెట్టేసింది. దాంతో మోడీకి ఆర్‌ఎస్‌ఎస్ కు గ్యాప్ వచ్చిందనే వాదనలు గట్టిగానే వినిపించాయి. అయితే మరికొంత మంది విశ్లేషకులు చెబుతున్నా దాని ప్రకారం గడ్కారీ ని దూరం పెట్టడానికి ప్రధాన కారణం ఆయన వ్యవహార శైలేనని కొందరి వాదన. ఎందుకంటే ఇటీవల గడ్కారీ కొన్ని సందర్భాలలో చేసిన వ్యాఖ్యలు మోడీని ఇరకాటంలో పెట్టె విధంగా ఉండడం. భవిష్యత్ లో మోడీ నాయకత్వానికి గడ్కారీ అడ్డుతగిలే అవకాశాలు కూడా ఉండడంతో ఈ సమీకరణలన్ని బేరీజు వేసుకొనే గడ్కారీకి బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ లో మోడీ స్థానం కల్పించలేదని కొందరి అభిప్రాయం.

అయితే ఆర్‌ఎస్‌ఎస్ కు మోడీ దూరం అయ్యే ప్రసక్తే లేదని కొందరి వాదన.. ఎందుకంటే బీజేపీని సంస్థాగతంగా క్షేత్ర స్థాయిలో ముందుకు తీసుకుపోవడంలో ఆర్‌ఎస్‌ఎస్ కీలక పాత్ర పోషిస్తోంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్‌ఎస్‌ఎస్ కు మోడీ దూరమయ్యే సాహసం చెయ్యలేరని మరికొందరి వాదన.

Also Read

ఆజాద్ కొత్త పార్టీ.. వెనుక బీజేపీ హస్తం ఉందా ?

కే‌సి‌ఆర్ రైతు సంఘాలతో భేటీ వెనుక ఉన్న అసలు వ్యూహం అదే ?

కాంగ్రెస్ కు దురమౌతున్న గాంధీ కుటుంబం !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -