Friday, April 26, 2024
- Advertisement -

పేద విద్యార్థులపై.. ఇంత నిర్లక్ష్యమా !

- Advertisement -

ఈ మద్య కాలంలో జగన్ సర్కార్ విద్యారంగంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో అందరికీ తెలిసిందే. ప్రైమరీ తరగతుల విలీనం మొదలుకొని.. ఉపాధ్యాయుల ఆన్లైన్ అటెండెన్స్ వరకు ఎన్నో విధానాలను విధ్యారంగంలో ప్రవేశ పెట్టింది. అయితే స్కూల్స్ విషయంలో సి‌ఎం జగన్ చేపడుతున్న విధానాలపై చాలావరకు విమర్శలే వినిపిస్తున్నాయి. ఈ సంగతి అలా ఉంచితే విద్యారంగానికి సంబంధించి జగన్ సర్కార్ పై హై కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్ లో పేద విద్యార్థులకు కేటాయించాల్సిన సీట్ల విషయంలో జగన్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ధర్మాసనం మండిపడింది. సాధారణంగా విద్యాహక్కు చట్టం ప్రకారం పేద విధ్యార్థులకు ప్రభుత్వ స్కూల్స్ మాత్రమే కాకుండా ప్రైవేట్ స్కూల్స్ లో 25 శాతం సీట్లు కేటాయించాలి. కానీ ఈ నిబంధన ఏపీలో సరిగా అమలు కానందున గతంలో దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. దాంతో తాజాగా ఈ అంశంపై హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి మొట్టికాయలు వేస్తూ.. కచ్చితంగా ఈ నిబంధన అమలు చేయాలని హెచ్చరించింది.

అయితే ప్రభుత్వ తరుపు న్యాయవాది దీనిపై వివరణ ఇస్తూ.. పేద విధ్యార్థులకు నిబందనల ప్రకారమే సీట్ల భర్తీ చేస్తున్నామని, దానికి సంబంధించిన వివరాలు కోర్టుకు సమర్పించేందుకు సమయం కావాలని కోరడంతో దీనిపై విచారణ సెప్టెంబర్ 7 కు వాయిదా పడింది. అయితే ఏపీ ప్రభుత్వం ఇచ్చే వివరాలు సంతృప్తికరంగా లేకుంటే వ్యక్తిగత విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని ధర్మాసనం వార్నింగ్ ఇచ్చింది. మరి జగన్ సర్కార్ సెప్టెంబర్ 7 నాటికి పేద విద్యార్థుల సీట్ల కేటాయింపుకు సంబంధించిన వివరాలను ఎంతవరకు కోర్టుకు సమర్పిస్తుందో చూడాలి.

Also Read

ఆర్‌ఎస్‌ఎస్ కు మద్దతుగా మమత.. బీజేపీకి భయపడుతోందా ?

చంద్రబాబు మనసులో ఏముంది ?

కే‌సి‌ఆర్ ను ఘోరంగా అవమానించిన నితిశ్ కుమార్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -