Sunday, May 5, 2024
- Advertisement -

బాలయ్యకు కూడా హరికృష్ణ గతేనా….. చంద్రబాబు మార్క్ పాలిటిక్స్

- Advertisement -

తనను గుడ్డిగా నమ్మి చేరదీసి, మంత్రిని చేసిన ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు మనుషులపై అస్సలు నమ్మకం ఉండదు అని టిడిపి సీనియర్ నాయకులే చెప్తూ ఉంటారు. అందుకే వెన్నుపోటు వ్యవహారంలో తనకు సహకరించిన నేతలను ఆ తర్వాత కాలంలో చంద్రబాబు పూర్తిగా దూరం పెట్టేశాడు. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను అయితే రాజకీయంగా అణిచివేశాడు అన్నది నిజం. ఎన్టీఆర్ వెన్నుపోటు వ్యవహారంలో చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంథేశ్వరి, బాలకృష్ణ, హరికృష్ణలు బాబుకు అండగా నిలబడి ఎన్టీఆర్‌కి ద్రోహం చేశారు. దగ్గుబాటి దంపతులకు మొదట్లోనే హ్యాండ్ ఇచ్చిన చంద్రబాబు……హరికృష్ణను మాత్రం తనకు అవసరమైనప్పుడల్లా వాడుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ సామర్థ్యం ముందు లోకేష్ నిలబడలేడు అన్న విషయం తెలిసిన వెంటనే ఎన్టీఆర్‌ని పూర్తిగా దూరం పెట్టేశాడు చంద్రబాబు. ఎన్టీఆర్ సినిమా కెరీర్‌ని కూడా దెబ్బకొట్టాలని చూశాడు. అదే సందర్భంలో హరికృష్ణను కూడా దూరం పెట్టేశాడు. అయితే నందమూరి వారసులను చంద్రబాబు అణగదొక్కుతున్నాడు అన్న అపప్రథ రాకుండా 2014 ఎన్నికల్లో బాలయ్యకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు బాబు.

సినిమాల్లో ఎన్టీఆర్ వారసుడిగా భారీ విజయాలు సాధించిన బాలయ్య……. రాజకీయాల్లో కూడా ఎన్టీఆర్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ముఖ్యమంత్రి అవుతాడని ఆయన అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు చాలనే ఆశించారు. అయితే బాలయ్య మాత్రం బాబు చాటునే ఉండిపోయాడు. చంద్రబాబు కూడా బాలయ్యకు కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వకుండా ….బాలయ్యకు రాజకీయంగా ఎదిగే అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తపడ్డాడు. బాలకృష్ణను చంద్రబాబు అస్సలు నమ్మడం లేదన్న విషయం అప్పుడే రాజకీయ విశ్లేషకులకు అర్థమైంది. ఇక ఇప్పుడు తాజాగా తెలుస్తున్న విషయం ఏంటంటే 2019 ఎన్నికల్లో బాలయ్యకు ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చే ఉద్ధేశ్యం బాబుకు లేదట. బాలయ్యపై హిందూపురం ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పడంతోనే ఈ నిర్ణయం అని చెప్పి బాబు సన్నిహితులు చెప్తున్నారుగానీ అసలు విషయం మాత్రం ఒక్కటే. రేపటి రోజున పరిస్థితులు ఎలా వచ్చినా లోకేష్‌కి అస్సలు పోటీ లేకుండా చేయాలన్నది బాబు ప్రయత్నం. బాలయ్య రంగంలో ఉంటే ఆయన అభిమానులు, తారకరత్న లాంటి నందమూరి వారసులు బాలయ్య సిఎం అంటూ హడావిడి చేస్తూ ఉంటారు. అదే బాలయ్య ఎమ్మెల్యేగా కూడా ఫెయిల్ అయ్యాడు అన్న ఒక ముద్రవేసి టికెట్ కూడా ఇవ్వకుండా చేస్తే ఇక ఆ తర్వాత టిడిపి శ్రేణులక బాబు తర్వాత లోకేష్ ఒక్కడే ప్రత్యామ్నాయంగా కనిపిస్తాడన్నది బాబు ప్లాన్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -