Thursday, May 9, 2024
- Advertisement -

ఎన్టీఆర్ వర్థంతి…… చంద్రబాబు వ్యూహంపై టిడిపి సీనియర్ నేతల గుస్సా

- Advertisement -

ఎన్టీఆర్ వర్థంతి రోజు చంద్రబాబు ఎందుకు ఎన్టీఆర్ ఘాట్‌ని సందర్శించలేదు? కలెక్టర్స్ కాన్ఫిరెన్స్ ఉండడం వళ్ళే అన్నది లోకేష్ చెప్పిన కారణం. కానీ ఈ కారణం అస్సలు హేతుబద్ధంగా లేదు. ఎన్టీఆర్ వర్థంతి రోజు ఆకస్మికంగా వచ్చినది కాదు కదా? అలాంటప్పుడు వర్థంతి గురించి తెలిసి కూడా చంద్రబాబు ప్రత్యేకంగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నట్టు? లోకేష్ చెప్పిన మాటలకు చంద్రబాబు చేతలకు అస్సలు పొంతన కుదరడం లేదు. అందుకే రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు చంద్రబాబు తీసుకున్న తీవ్రనిర్ణయం వెనకాల కారణాలను ఆరాతీశారు. 2014 ఎన్నికల్లో కూడా ఎన్టీఆర్ బొమ్మ చూపించి, ఎన్టీఆర్ పేరు చెప్పుకుని ఎన్నికలను ఎదుర్కున్న చంద్రబాబు ఎన్టీఆర్ వర్థంతి రోజు ఎన్టీఆర్ ఘాట్‌ని సందర్శించకూడదు అన్న తీవ్ర నిర్ణయం తీసుకోవడం వెనక ఉన్న బాబు వ్యూహం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.

ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచి అధికారం లాక్కున్న మరుక్షణం నుంచీ కూడా ఎన్టీఆర్ పేరును టిడిపి పార్టీ నుంచి, తెలుగు ప్రజల మనస్సులోంచి పూర్తిగా చెరిపేయాలని చాలా ప్రయత్నాలే చేశాడు చంద్రబాబు. ఒక టైంలో ఎన్టీఆర్ భవన్, టిడిపి కార్యాలయాల్లో ఎన్టీఆర్ పేరు, బొమ్మ లేకుండా చేసే ప్రయత్నం చేశాడు చంద్రబాబు. అయితే ఎన్టీఆర్ పేరు లేకుండా ఎన్నికలకు వెళితే పరాజయం ఖాయం అని బాబు మీడియా వర్గాలు కుండబద్ధలు కొట్టేస్తూ ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్టీఆర్ గురించి గొప్పగా చెప్పాల్సిన పరిస్థితి బాబుది.

కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారిపోయాయని చంద్రబాబు సొంత విశ్లేషణకు వచ్చాడట. ఎన్టీఆర్ చనిపోయి దశాబ్ధాలు దాటిపోయిన నేపథ్యం…..2014 ఎన్నికల తర్వాత నుంచీ చంద్రన్న పథకాలు అంటూ తన పేరుతో తానే చేసుకున్న ప్రచారం నేపథ్యంలో ఇక ఎన్టీఆర్ పేరును వాడుకోవాల్సిన అవసరం లేదని చంద్రబాబు భావిస్తున్నాడు. అన్నింటికీ మించి అందరికన్నా గొప్పవాడిని అని అనిపించుకోవాలని చంద్రబాబుకు ఎప్పుడూ ఉంటుంది. ఆ స్థాయిలో తన గురించి తానే ప్రచారం చేయించుకుంటూ ఉంటాడు. ఎన్టీఆర్ పేరు ఉన్నంత వరకూ తెలుగు ప్రజల చరిత్రలో తానే గొప్ప ముఖ్యమంత్రిని అని బాబు చెప్పుకోలేడు. అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ పేరును వీలైనంత వరకూ మరుగున పడిపోయేలా చేసే ప్రయత్నాల్లో బాబు ఉన్నాడట. బాబు మీడియా కూడా ఎన్టీఆర్ వర్థంతి రోజు ఎక్కడా కూడా ఆయన రాజకీయ కార్యక్రమాల గురించి అస్సలు ప్రస్తావన కూడా తీసుకురాలేదు. అయితే ఈ మొత్తం వ్యూహాన్ని టిడిపి సీనియర్ నేతలు కూడా తప్పు పడుతున్నట్టుగా తెలుస్తోంది. 2014ఎన్నికల్లో అత్యుత్సాహం, అతి విశ్వాసం వళ్ళే ఓడిపోయామన్న విషయాన్ని గుర్తించి వైఎస్ జగన్ ఇప్పుడు జాగ్రత్తగా ఎన్నికల వ్యూహాలు రచిస్తుంటే ……చంద్రబాబు మాత్రం ‘చంద్రన్న’ పేరు గురించి అతిగా ఊహించుకున్నాడని……సామాన్య ప్రజల్లో కనీస స్థాయి స్పందన కూడా చంద్రన్నకు లేదని వాళ్ళు చెప్తున్నారట. ఇలాంటి అతి విశ్వాసంతో ఎన్నికలకు వెళ్తే మరోసారి ప్రతిపక్షంలో కూర్చోవాల్సి ఉంటుందని టిడిపి సీనియర్ నేతలు హెచ్చరిస్తున్నారు. ముందు ముందు బాబు చర్యలు ఎలా ఉంటాయో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -