Wednesday, May 15, 2024
- Advertisement -

రాజ‌కీయ యాత్ర‌పై కీలక ప్రకటన చేసిన పవన్ కల్యాణ్….అభిమానుల్లో జోష్‌..

- Advertisement -

రెండు తెలుగు రాష్ట్రాల్లో త‌న రాజ‌కీయ యాత్ర‌పై కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు ప‌వ‌న్ క‌ళ్యాన్‌. విభ‌జ‌న త‌ర్వాత రెండు రాష్ట్రాల్లో ప‌వ‌న్‌కు ఉన్న ఫాలోయింగ్ చెప్పాల్సిన ప‌నిలేదు. ప‌వ‌న్ పార్ట్‌టైం పోలిటీషియ‌న్ అనే విమ‌ర్శ‌ల‌కు తెర‌దించారు. 2014 ఎన్నిక‌ల్లో గత ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఈసారి పోటీ చేస్తారన్న ప్రచారం సాగుతోంది.

త్వరలో తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించుకుంటానని కొద్దిసేపటికిందట పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తమ కుటుంబ ఇలవేల్పు కొండగట్టు ఆంజనేయ స్వామి అని పవన్ పేర్కొన్నారు. అందుకే తన రాజకీయ యాత్రను కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం నుంచే ప్రారంభిస్తానని పవన్ ప్రకటించారు. సర్వమత ప్రార్థనల అనంతరం ప్రజల ఆశిష్సులతో రాజకీయయాత్ర చేపడతానని వివరించారు.

 

2009లో ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న సందర్భంలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డది కొండగట్టు ప్రాంతంలోనే అని పవన్ పేర్కొన్నారు. కొండగట్టుకు ఎప్పుడు వెళ్లేది త్వరలోనే వెల్లడిస్తానని పవన్ ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు. ఈ యాత్ర ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తానని పవన్ వెల్లడించారు. ప్రజా సమస్యలు అధ్యయనం చేసి అవగాహన చేసుకునేందుకు మీముందుకు వస్తున్నానని ప్రకటించారు. కొండగట్టు అంజన్న సమక్షంలోనే తన రాజకీయ భవిష్యత్తు ప్రణాళికను ప్రకటిస్తానని పవన్ స్పష్టం చేశారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -