Saturday, May 3, 2025
- Advertisement -

దేవునితో చెలగాటం వద్దు : సీఎం జగన్ మోహన్ రెడ్డి

- Advertisement -

అర్హత ఉండి ఇంటి పట్టా రాలేదనే మాట వినిపించకూడదని సీఎం జగన్​ అన్నారు. సీఎంవో అధికారులతో ముఖ్యమంత్రి జగన్‌ సమావేశం నిర్వహించారు. అనర్హుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విగ్రహాల విధ్వంసం వంటి ఘటనలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని సీఎం అన్నారు.

దేవుడితో చెలగాటమాడితే తప్పకుండా శిక్షిస్తాడని.. మరోసారి ఇలాంటి తప్పిదాలకు పాల్పడకుండా చర్యలు ఉండాలని అధికారులను ఆదేశించారు. విగ్రహాల ధ్వంసం అంశంలో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. సచివాలయాల్లో దరఖాస్తులు పెండింగ్‌ లేకుండా చూసుకోవాలి అధికారులను ఆదేశించారు.

విపత్తు తక్షణ స్పందన దళం వాహనాలను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. తాడేపల్లి కార్యాలయం నుంచి దూరదృశ్య మాద్యమం ద్వారా సీఎం జెండా ఊపి ఆ వాహనాలను ప్రారంభించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఈ వాహనాలు ఎంతో తోడ్పడతాయన్నారు. రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని మరింతగా బలపరిచేలా.. వారి సమర్థతను మరింతంగా పెంచుతాయన్నారు.

ఆలయాలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం : పవన్ కళ్యాన్

వకీల్ సాబ్ ఇది సీఎం జగన్ అడ్డా.. నువ్వు రీల్.. ఈయన రియల్..!

దేవుడి ఎదుటకు మరో టీడీపీ ఎమ్మెల్యే!

రేవంత్ రెడ్డి నుంచి ప్రాణహానీ ఉంది..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -