Sunday, April 28, 2024
- Advertisement -

రేవంత్ రెడ్డి నుంచి ప్రాణహానీ ఉంది.. డీజీపీకి లేఖ రాసిన వీహెచ్

- Advertisement -

పీసీసీ చీఫ్ మార్పు తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య చిచ్చు పెట్టింది. లీడర్ల మాటలు పార్టీ పరువును బజారుకీడుస్తున్నాయి. వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అవుతారని జరుగుతున్న ప్రచారంతో సీనియర్ నేతలు మండిపడుతున్నారు. నిన్న గాక మొన్న బయటి నుంచి వచ్చిన వ్యక్తి ఎలా పీసీసీ చీఫ్ అవుతారని వాళ్లు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు(వీహెచ్) ఇదే రకమైన గళాన్ని వినిపించారు. ఆయనపై ఓటుకు నోటు, మనీ లాండరింగ్ కేసులు ఉన్నాయంటూ ఆరోపించారు. దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్‌ను అంటిపెట్టుకుని ఉన్న వారిని కాదని రేవంత్‌కు ఇవ్వాలనుకోవడం సరికాదని పార్టీకి ఫిర్యాదు చేశారు. రెండు పార్టీలు మారివచ్చిన వారికి పీసీసీ అధ్యక్ష పదవిని ఇవ్వాలని భావించడం క్యాడర్ మనోభావాలను దెబ్బతీస్తుందంటూ ఇదివరకు ఆయన హెచ్చరించారు.

అంతే కాదు, పీసీసీ చీఫ్ పదవి రేవంత్ రెడ్డికి దక్కకుండా అడ్డుతగులుతున్నానంటూ ఆయన అనుచరుల నుంచి తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయంటూ వీహెచ్ ఆరోపించడంతో ఈ వివాదం మరింత ముదిరింది. సైబరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదంటూ ఆయన తాజాగా డీజీపీ ఎం మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డిపై తనకు ప్రాణభయం ఉందని, రక్షణ కల్పించాలంటూ డీజీపీ కోరారు. రేవంత్‌ గురించి మాట్లాడితే చంపేస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. తనకు వెంటనే రక్షణ కల్పించాలని ఈ లేఖలో పేర్కొన్నారు తనను ఫోన్ చేసిన బెదిరించిన వారిని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -