Friday, May 3, 2024
- Advertisement -

సొంత‌గ‌డ్డ‌పై చిత్తుగా ఓడిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ …

- Advertisement -

సొంత గ‌డ్డ‌పై రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కోల్‌క‌తా చేతిలో చిత్తుగా ఓడింది. వ‌రుస విజ‌యాల ప‌రంప‌ర‌కు అడ్డుక‌ట్ట వేసింది కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌. తొలుత రాజస్థాన్‌ను 160 పరుగులకే కట్టడి చేసిన కోల్‌క‌తా.. బ్యాటింగ్‌లోనూ రాణించింది. టాప్ ఆర్డర్ రాణించడంతో.. ఏడు వికెట్ల తేడాతో నైట్ రైడర్స్ ఘన విజయాన్ని అందుకుంది. దీంతో సొంత గడ్డ మీద నాలుగేళ్లుగా ఓటమి ఎరుగని రాజస్థాన్‌కు ఓటమి రుచి చూపించింది.

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ రాయల్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. డి ఆర్కీ షార్ట్‌ (43 బంతుల్లో 44; 5 ఫోర్లు, 1 సిక్స్‌), కెప్టెన్‌ అజింక్య రహానే (19 బంతుల్లో 36; 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. రాణా, కరన్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం కోల్‌కతా 18.5 ఓవర్లలో 3 వికెట్లకు 163 పరుగులు చేసి విజయాన్నందుకుంది. రాబిన్‌ ఉతప్ప (36 బంతుల్లో 48; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), దినేశ్‌ కార్తీక్‌ (23 బంతుల్లో 42 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), నరైన్‌ (25 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్‌), ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ నితీశ్‌ రాణా (27 బంతుల్లో 35 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. కోల్‌కతా స్పిన్నర్ల దెబ్బకు తొలి మూడు ఓవర్లో 9 పరుగులే చేసిన రాజస్థాన్.. రహానే దూకుడుతో పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 48 పరుగులు చేసింది. రహానేను (19 బంతుల్లో 36) దినేశ్ కార్తీక్ స్టంపౌట్ చేయగా.. శాంసన్ (7) త్వరగా పెవిలియన్ చేరాడు.

స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడిన డార్సీ (43 బంతుల్లో 44).. పేసర్ల బౌలింగ్‌లో ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. చివరకు నితీష్ రాణా ఓవర్లో అవుటయ్యాడు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో.. రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులకే పరిమితమైంది. చివర్లో బట్లర్ (18 బంతుల్లో 24) దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. కోల్‌కతా బౌలర్లలో నితీష్ రాణా, టామ్ ఖుర్రాన్‌కు చెరో రెండు వికెట్లు దక్కాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -