Friday, May 3, 2024
- Advertisement -

వైకాపాలో చేరికలు….. బాపట్ల నియోజక వర్గంలో విజయం ఖాయం

- Advertisement -

2019 ఎన్నికల ఏడాది మొదలైనప్పటి నుంచీ వైకాపాలోకి చేరికలు భారీగా పెరిగాయి. వైఎస్ జగన్ సంకల్పయాత్ర సాగుతున్న అన్ని నియోజకవర్గాల్లోనూ వైకాపాలోకి చేరికలు భారీగా ఉంటున్నాయి. మొదట్లో సంకల్పయాత్ర ఫెయిల్ అవుతుందని ఎద్దేవా చేసిన చంద్రబాబు కూడా ప్రజల్లో వస్తున్న భారీ స్పందన చూశాక జగన్ పాదయాత్రపై విమర్శలు చెయ్యొద్దని టిడిపి నాయకులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాడు. విమర్శలు చేస్తే జగన్‌కి ఇంకా క్రేజ్ వస్తుందన్నది చంద్రబాబు భయం. అయితే వైకాపాలోకి చేరికలు అడ్డుకోవాలనుకున్న చంద్రబాబు వ్యూహాలు మాత్రం పూర్తిగా ఫెయిలవుతున్నాయి.

తాజాగా ఫిరాయింపు ఎమ్మెల్యేల బలంతో మూడో అభ్యర్థిని కూడా గెలిపించుకోవాలని ప్లాన్ చేసిన చంద్రబాబు…జగన్ వ్యూహాలు తెలుసుకుని ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఇక వైకాపాలో చేరికలను కూడా అడ్డుకోవాలన్న బాబు ప్రయత్నం మరోసారి ఫెయిల్ అయింది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు, బాపట్ల నిజయోజకవర్గంలో ప్రజా బలం ఉన్న చేజర్ల కుటుంబం నుంచి ప్రాతినిధ్యం చేజర్ల నారాయణరెడ్డిని టిడిపిలో చేర్చుకోవడానికి సిఎం రమేష్, లోకేష్‌లు చాలా ప్రయత్నాలే చేశారు. అయితే చేజర్ల మాత్రం టిడిపి జనాలకు షాకిస్తూ జగన్ సంకల్పయాత్ర సందర్భంగా జగన్ సమక్షంలో వైకాపాలో చేరాడు. చంద్రబాబు డబ్బు రాజకీయాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. రాజకీయాల్లో విలువలు పాటించడంలో వైఎస్‌లకు చంద్రబాబుకు నక్కకూ నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని చెప్పుకొచ్చాడు నారాయణరెడ్డి. అసలే ఎన్నికల ఏడాది స్టార్ట్ అయినప్పటి నుంచీ ఏదీ కలిసిరాని చంద్రబాబుకు ఇప్పుడు మరో షాక్ గట్టిగా తగిలినట్టేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నాయకుల చేరికలు వైకాపా శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం పెంచుతాయని……అధికారంలో ఉన్నప్పటికీ టిడిపిని వదిలిపెట్టి వైకాపా వైపు నాయకులు చూస్తుండడం 2019 ఎన్నికలకు సంబంధించి కచ్చితంగా చెడు సంకేతమే అని టిడిపి నేతలు కూడా అంతర్గతంగా ఒప్పుకుంటున్నారు. 2019లో టిడిపి ఓడిపోవడం ఖాయం అని సర్వేలు కూడా చెప్తున్న నేపథ్యంలో చంద్రబాబు రాజకీయ వ్యూహాలు ఎలా ఉంటాయో చూడాలి మరి. ప్రస్తుతం అయితే మాత్రం జగన్‌కి ఉన్న ప్రజాదరణ రోజు రోజుకూ పెరుగుతూ ఉందన్నది మాత్రం నిజం. ఆ స్థాయి ప్రజాదరణను రాజకీయ వ్యూహాలతో, ప్రచార పటాటోపాలతో ఎదుర్కోవడం అంటే చంద్రబాబుకు తలకు మించిన పనేనన్నది రాజకీయ విశ్లేషకుల మాట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -