Monday, May 13, 2024
- Advertisement -

బాబు దీక్ష వ‌య‌సుమ‌ళ్లిన త‌ర్వాత కాపురంలా ఉంది…. సీపీఐనేత నారాయ‌ణ‌

- Advertisement -

కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ఒక రోజు దీక్ష చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ దీక్ష‌పై విమ‌ర్శ‌లు వెల్లు వెత్తాయి. దీక్ష‌లు, బంద్‌ల‌తో ఏమోస్తాద‌ని గ‌తంలో బాబు వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అప్పుడు ఒక‌లా మాట్లాడిన బాబు ఇప్పుడు దీక్ష చేయ‌డం విడ్డూరంగా ఉంద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

బాబు ఒక రోజు తీక్ష‌పై సీపీఐ జాతీయ నేత నార‌యాణ విమ‌ర్శ‌లు చేశారు. చంద్రబాబు దీక్ష వయసు మళ్లిన తర్వాత కాపురంలా ఉందని ఎద్దేవ చేశారు. బాబు దీక్షతో రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని అన్నారు. పవన్ కల్యాణ్ గతంలో ఎప్పుడూ వివాదాస్పదం కాలేదని, రాజకీయాల్లోకి వచ్చాకే పవన్ ని వివాదాస్పదం చేశారని విమర్శించారు. ఎవరినైనా తప్పులుంటే విమర్శించాలి తప్ప, వ్యక్తిత్వ హననం సబబు కాదని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -