Saturday, May 10, 2025
- Advertisement -

బాబు స‌న్నిహితుడు కేంద్ర మాజీ మంత్రికి బిగ్ షాక్‌…..

- Advertisement -

టీడీపీ మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. తాజాగా ఢిల్లీహైకోర్టు బిగ్‌షాక్ ఇచ్చింది. ఆర్థిక అక్రమాలు జరిగినట్లు ఆరోపిస్తూ ఈడీ సమన్లు జారీ చేయడంతో …వాటిని ర‌ద్దు చేయాల‌ని ఢిల్లీ హైకోర్టుకు వెళ్లిన టీడీపీ ఎంపీ, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సన్నిహితుడు, కేంద్ర మాజీమంత్రి సుజనా చౌదరికి ఝలక్ తగిలింది. ఈడీ సమన్లను రద్దు చేయడానికి నిరాకరించింది. అంతేగాక.. ఈడీ విచారణకు హాజరు కావాల్సిందిగా చౌదరిని ఢిల్లీ హైకోర్టు ఆదేశించడం ఇప్పుడు రాజ‌కీయా వ‌ర్గాల్లో హాట్ టాఫిక్‌గా మారింది.

తనపై కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఈడీ వేధిస్తోందని చౌదరి ఈ పిటిషన్ దాఖలు చేశాడు. కాబట్టి తనకు ఈడీ విచారణ నుంచి మినహాయింపును ఇవ్వాలని కోర్టును కోరాడు. ఆయ‌న వాద‌న‌ను తిరస్క‌రించిన కోర్టు ఈడీ విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సిందేన‌ని వెల్ల‌డించింది.

అయితే ఏపీలోకి సీబీఐ రాకుండా ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోవ‌డంతో కేసు విచార‌ణ అంతా ఢిల్లీలోనే జ‌ర‌గ‌నుంది. మొత్తం ఆరువేల కోట్లరూపాయల స్కామ్ కు సూత్రధారిగా సుజనా చౌదరి పేరును పేర్కొంది ఈడీ. ఈ నేపథ్యంలో ఈయన విచారణకు ఈడీ రంగం సిద్ధం చేస్తోంది.

విచార‌ణ త‌ర్వాత ఆయ‌న‌ను అరెస్ట్ చేసి అవ‌కాశాలు ఉన్నాయ‌ని ఢిల్లీ వ‌ర్గాలు అంటున్నాయి. చౌదరిని ఈడీ అదుపులోకి తీసుకోవచ్చని.. తీహార్ జైలుకు తరలించవచ్చ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఆయ‌న‌కు స్వ‌ల్ప ఊర‌ట క‌లిగించింది కోర్టు. ప్రస్తుతానికి సుజనాను అరెస్ట్ చేయవద్దని స్పష్టంచేసింది. ఎలాంటి బలవంతపు చర్యలకు పాల్పడకూడదని సూచించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -