Saturday, April 27, 2024
- Advertisement -

ఆ 100 కోట్లపైనే ఈడీ ఆరా!

- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణ నాలుగో రోజు కొనసాగుతోంది. ఇక నాలుగో రోజు కూడా కవితపై ప్రశ్నల వర్షం కురిపించారు ఈడీ అధికారులు. ప్రధానం ఆ 100 కోట్లు ఎక్కడివి,సౌత్ గ్రూప్ పాత్ర, కేజ్రివాల్,సిసోడియాతో ఒప్పందాలపై విచారణ జరుపుతున్నారు.

కవిత నుండి లిఖితపూర్వకంగా, మౌఖికంగా కవిత నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ నెల 23వ తేదీవరకు కవిత ఈడీ కస్టడీలో ఉండనున్నారు. ప్రతి రోజు 6 నుండి 7 గంటల పాటు కవితను ప్రశ్నిస్తున్నారు.

ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు , అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు కవితను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. సీసీటీవీ పర్యవేక్షణలో కవిత చెప్పే ఆధారాలను రికార్డు చేస్తున్నారు. ఈ నెల 15న కవితను అరెస్ట్ చేయగా 10 రోజుల కస్టడీ కోరగా వారం రోజుల కస్టడీకి అనుమతించింది రౌస్ అవెన్యూ కోర్టు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -