కర్నూలు జిల్లా టీడీపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీలోకి కోట్ల రాకతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. కోట్ల రాకను డిప్యూటీ సీఎం కేఈ కుటుంబం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే రేపు సీఎం చంద్రబాబుతో కేఈ కృష్ణమూర్తి ఫ్యామిలీ భేటీ కానుంది. కోట్ల విషయంలోనే చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇదే ఇప్పుడు పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
అమరావతిలో బాబు భేటీలో కేఈ బ్రదర్స్ కోట్ల చేరికపై తమ వాదనలను సీఎం చంద్రబాబుకు వినిపించనున్నారు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీ చేరికపై కేఈ అసంతృప్తితో ఉన్నారని సమాచారం. కోట్ల, చంద్రబాబు భేటీపై తనకు ఎలాంటి సమాచారం లేదని.. ఈ భేటీ విషయమై తనతో ఎవరు కూడా సంప్రదించలేదని.. తనకు సమాచారం ఇచ్చారన్న వార్తల్లో వాస్తవం లేదని కేఈ ఇంతకుముందే సెలవిచ్చారు.
జిల్లా రాజకీయాల్లో కేఈ, కోట్ల కుటుంబాలకు బలమైన రాజకీయ నేపథ్యం ఉంది. ఇద్దరి కుటుంబాల మధ్య రాజకీయ వైరం ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోట్ల రాక కేఈ కుటుంబం తీవ్ర అసంతృప్తి ని వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో చంద్రబాబు, కేఈల భేటీకి ప్రాధాన్యం సంచరించుకుంది. ఒక వేల కోట్లను పార్టీలో చేర్చుకుంటే కేఈ కుటుంబం రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటోందనని రాజకీయ వర్గాల్లో అసక్తికర చర్చ జరగుతుందో.