Sunday, May 4, 2025
- Advertisement -

జగన్ గెలవకపోతే రాజీనామా చేస్తా : దర్మాన !

- Advertisement -

ఏ పార్టీలోనైనా ఆ పార్టీ నేతలు వారి అధ్యక్షుడిని పొగడ్తలతో ముంచెత్తడం సర్వసాధారణం. ఈ భజనల పర్వానికి ఏ పార్టీ అతీతం కాదు. ముఖ్యంగా ఏపీలో అధికార వైసీపీ పార్టీలో ఈ భజనల పర్వం కాస్త ఎక్కువే అని చెప్పాలి. ముఖ్యంగా కొడాలి నాని, ఆర్కే రోజా, పెర్ని నాని వంటి వారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను ఆకాశానికెత్తడంలో వీరి రూటే సపరేటు. జగన్ పై ఏ చిన్న విమర్శ వచ్చిన వెంటనే వాటిని తిప్పికొడుతూ.. వారి నాయకుడిపై పొగడ్తల వర్షం కురిపిస్తూ ఉంటారు. ఈ సంగతి అలా ఉంచితే తాజాగా మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ చేసిన వ్యాఖ్యలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ విజయం సాధిస్తుందని, జగన్ ముఖ్యమంత్రి అవుతారని జోష్యం చెప్పారు.

ఇంతవరకు బాగానే ఉన్నప్పటికి అలా కానీ పక్షంలో తను ఎమ్మెల్యేగా గెలిచినప్పటికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పుకొచ్చారు. దీంతో నెటిజన్స్ ” ముందు మీరు గెలవాలి కదా.. ” అంటూ రకరకలుగా సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. శ్రీకాకులం జిల్లా సారవకోట మండలంలోని చీడపూడి గ్రామంలో ” గడప గడప కు మనప్రభుత్వం ” కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పై విధంగా చెప్పుకొచ్చారు. అంతే కాకుండా జగన్ సమర్థవంతమైన నాయకూడని అందుకే సింగిల్ గా 175 స్థానాల్లో పోటీ చేస్తారని.. దమ్ముంటే టీడీపీ, జనసేన 175 స్థానాల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. మూడు రాజధానుల వల్ల ప్రజలకు చాలా ప్రయోజనలు ఉన్నాయని.. కానీ దాన్ని అడ్డుకునేందుకు టీడీపీ జనసేన ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

బీజేపీకి పవన్ పంచ్ గట్టిగా తాకిందా ?

కాంగ్రెస్ లో కట్టప్ప.. వెన్నుపోటు తప్పదా ?

నిరుద్యోగాన్ని పరిష్కరించడం కష్టమే

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -