Saturday, April 27, 2024
- Advertisement -

నిరుద్యోగాన్ని పరిష్కరించడం కష్టమే : ప్రధాని మోడి

- Advertisement -

ప్రపంచాన్ని కరోనా కమ్మేసిన తరువాత.. చాలా దేశాలు ఆర్థిక మాంద్యం లోకి వెళ్లిపోయాయి.ఇక ఇప్పుడిప్పుడే ఆయా దేశాలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. ఇక మనదేశం విషయనికొస్తే.. కరోనా కారణంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కరోనా కారణంగా చాలమంది ఇళ్లకే పరిమితం కావడంతో..నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది. ఇక ఇతర దేశాల నుంచి ఎగుమతులు, దిగుమతులకు అంతరాయం ఏర్పడడంతో ఆర్థికంగా కూడా చాలానే నష్టాలను చవిచూసింది భారత్. ఫలితంగా నిత్యవసర ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో.. సామాన్యుడిపై అధికభారం పడింది.

అయితే కరోనా కష్టకాలంలో కూడా ఆర్థిక వ్యవస్థను స్టేబుల్ గా ఉంచడంలో మన కేంద్ర ప్రభుత్వం సక్సస్ అయింది. ఫలితంగా ప్రపంచంలోనే ఐదవ ఆర్థిక శక్తిగా భారత్ అవతరించింది. ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన అమెరికా, రష్యా, చైనా, జపాన్ దేశాల తరువాత మనదేశం ఐదవ స్థానంలో నిలిచింది. గతంలో ఐదవ స్థానంలో ఉన్న బ్రిటన్ ను వెనక్కి నెట్టి భారత్ నిలిచింది. ఈ సంగతి అలా ఉంచితే.. భారత్ ఐదవ ఆర్థిక శక్తిగా అవతరించడంపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. రోజ్ గార్ మేళా ప్రారంభించిన అనంతరం ప్రధాని మోడీ కొన్ని ఆసక్తికర కొన్ని ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు.

కరోనా కారణంగా మన దేశం చాలా నష్టపోయిందని, అలాగే ప్రపంచ దేశాలతో పాటు మనదేశంలో కూడా ద్రవ్యోల్బణం, నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందని మోడీ చెప్పుకొచ్చారు. దేశంలో కరోనా కారణంగా ఏర్పడిన నిరుద్యోగాన్ని 100 రోజుల్లో రూపు మాపడం అసాధ్యమని మోడీ చెప్పుకొచ్చారు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నామని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రజా సహకారంతో ముందుకు సాగుతామని మోడీ అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -