Saturday, May 11, 2024
- Advertisement -

బీజేపీకి పవన్ పంచ్ గట్టిగా తాకిందా ?

- Advertisement -

ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసిన జనసేనకు సంబంధించిన చర్చే అధికంగా జరుగుతోంది. నిన్న మొన్నటి వరకు జనసేనను లైట్ తీసుకున్న వైసీపీ విశాఖ ఘటన తరువాత అలెర్ట్ అయ్యింది. ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా గేరు మార్చి తాను చేసే వ్యాఖ్యలలో కాస్త ఘాటు పెంచారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఇప్పుడు పవన్ పై పడింది. ఇక ఇప్పటికే పవన్ను మచ్చిక చేసుకోవడంలో టీడీపీ సక్సస్ అయ్యింది. విశాఖ ఘటనలో పవన్ కు జరిగిన పరాభవానికి సంఘీభవం తెలుపుతూ స్వయంగా చంద్రబాబే పవన్ తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. దాంతో టీడీపీ జనసేన పొత్తు బహిరంగ వాస్తవంగా మారింది.

ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే ఈ కలయిక అని అటు పవన్, చంద్రబాబు ముక్తకంఠంతో చెబుతున్నప్పటికి.. ఇరు పార్టీల పొత్తు ఖాయమే అనే భావనకు వచ్చారంతా. దీంతో ఇక ఇప్పటికే జనసేన మిత్రా పక్షంగా ఉన్న బీజేపీ పరిస్థితే కాస్త అయోమయంగా మారింది. ఎందుకంటే టీడీపీ జనసేనతో కలిస్తే బీజేపీ కలిసే ప్రసక్తే లేదని ఏపీ కమలనాథులు కొంతకాలంగా గట్టిగానే చెప్పుకొస్తున్నారు. తీర ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే జనసేన టీడీపీ పొత్తు అనివార్యంగా మారింది. విశాఖ ఘటన తరువాత పవన్ కు సంఘీభవం తెలుపడంలో చంద్రబాబు చూపిన చోరువ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చూపలేదని ఆ పార్టీ సీనియర్ నేత కన్నా లక్ష్మినారాయణ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు.

దాంతో పవన్ బీజేపీకి దూరం అవుతున్నారనే ఆవేదన కమలనాథులలో స్పష్టంగా కనిపించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. పవన్ కూడా కొంతకాలంగా బీజేపీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి కనబరచడం లేదు. దీంతో బీజేపీ జనసేన మద్య దూరం పెరిగిందనే వాదన అడపా దడప వినిపిస్తూనే ఉంది. ఒకవేళ జనసేన బీజేపీకి పూర్తిగా దూరం అయితే బీజేపీ మరింత నష్టపోయే అవకాశం ఉంది. ఎందుకంటే జనసేన అండతోనే వచ్చే ఎన్నికల్లో ఏపీలో నిలదొక్కుకోవలని ప్లాన్ చేసిన బీజేపీకి పవన్ దూరం కావడం ఏమాత్రం మింగుడు పడని విషయం. బీజేపీ సింగిల్ గా బరిలోకి దిగిన ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ఏపీలో ఉంది. ఈ నేపథ్యంలో పవన్ పై నిర్లక్ష్య ధోరణి వ్యవహరించిన బీజేపీకి పవన్ టీడీపీతో కలిసి ఊహించని షాక్ ఇచ్చారని పోలిటికల్ సర్కిల్స్ లో చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ పవన్ బీజేపీకి దూరమైతే బీజేపీ పరిస్థితి వాట్ నెక్స్ట్ అంటే ప్రశ్నార్థకమే.

ఇవి కూడా చదవండి

కాంగ్రెస్ లో కట్టప్ప.. వెన్నుపోటు తప్పదా ?

ఎన్ని అడ్డంకులు వచ్చిన విశాఖనే.. రాజధాని !

కాంగ్రెస్, వైసీపీతో పొత్తు.. మరి జగన్ ఒప్పుకుంటారా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -