Monday, April 29, 2024
- Advertisement -

కాంగ్రెస్ లో కట్టప్ప.. వెన్నుపోటు తప్పదా ?

- Advertisement -

తెలంగాణలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవితో పాటు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి బీజేపీలో చేరిన తరువాత టీకాంగ్రెస్ లో ముసలం ఏర్పడింది. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడడంతో ఆయన బ్రదర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కాంగ్రెస్ వీడే అవకాశం ఉందని ఆ మద్య బలంగా వార్తలు వినిపించాయి. కానీ వెంకటరెడ్డి మాత్రం తాను ఎప్పటికీ కాంగ్రెస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. అయినప్పటికి ఆయన వైఖరిపై టీకాంగ్రెస్ నేతల్లో అనుమానాలు గట్టిగానే వ్యక్తమయ్యాయి. ఎందుకంటే తరచూ తనను తాను పార్టీలో తక్కువ చేసుకొని మాట్లాడడం.. అలాగే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండడం వంటివి చేస్తున్నారు.

ఇక మునుగోడు ఉపఎన్నిక వేళ కాంగ్రెస్ పార్టీకి ఈ ఉపఎన్నిక అత్యంత కీలకం ఎందుకంటే మునుగోడు సిట్టింగ్ స్థానం కావడంతో.. కాంగ్రెస్ ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. మరి కాంగ్రెస్ కు ఇంత కీలకమైన మునుగోడులో కాంగ్రెస్ తరుపున కీలక నేతగా ఉన్నకోమటిరెడ్డి వెంకటరెడ్డి మునుగోడు లో పార్టీ తరుపున ప్రచారానికి ఏమాత్రం మొగ్గు చూపడంలేదు. దీంతో సొంత పార్టీ నేతలే ఆయనను పార్టీ నుంచి వెళ్లిపోవాలని సూచిస్తున్నారు. అయినప్పటికి తను కాంగ్రెస్ లోనే ఉంటానని.. తను పార్టీ మరే ప్రసక్తే లేదని కరాకండి చెప్పేస్తున్నారు వెంకటరెడ్డి. ఇనతవరకు బాగానే ఉన్నప్పటికి.. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీజేపీలో ఉన్న తన తమ్ముడు గెలవాలని ప్రచారం చేస్తున్నట్లు వెంకటరెడ్డికి సంబంధించిన ఆడియో లీక్ లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కాంగ్రెస్ పార్టీ గెలిచే ప్రసక్తే లేదని, ఆయన పోటీ టి‌ఆర్‌ఎస్, బీజేపీ మద్యనే ఉండబోతుందని, అందుకే గెలవని పార్టీ కోసం ఎందుకు ప్రచారం చేయాలని.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెబుతున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. దీంతో కాంగ్రెస్ నేతలు కోమటిరీడ్డి వెంకటరెడ్డిపై మండిపడుతున్నారు. సొంత పార్టీలో ఉంటూ పక్క పార్టీ గెలవాలని కోరుకుంటున్నాడని, వెంకటరెడ్డి కాంగ్రెస్ కు వెన్నుపోటు పొడుస్తున్నాడని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. అయితే తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ప్రత్యర్థి పార్టీలో ఉండడం వల్ల వెంకటరెడ్డి ప్రచారానికి దూరంగా ఉండడం సమంజసమే కానీ.. కానీ తనున్న పార్టీకి వెన్నుపోటు పొడుతూ కటప్ప పాత్ర పోషిస్తున్నడని కొందరు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

జగన్ కు మరోసారి షాక్ ఇచ్చిన షర్మిల !

బీజేపీకి షాక్.. కే‌సి‌ఆర్ వ్యూహం !

పవన్ నాలుగో పెళ్లికి.. పోలవరం పూర్తి కావడానికి లింకేంటి ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -