Monday, April 29, 2024
- Advertisement -

బీజేపీ లో ఈ ఇద్దరు నిజంగానే అధికారంలోకి తెచ్చేలా ఉన్నారే..?

- Advertisement -

బీజేపీ రాజకీయం ఎలా ఉంటుందంటే తమ ఉనికి అస్సలు లేని చోట కూడా అధికారంలోకి వచ్చేంత సత్తా వారికి ఉంది.. కాకపోతే అది టైం తో కూడుకున్న విషయం కాబట్టి ఆచితూచి అడుగేలేస్తూ ముందుకు వెళ్తుంది.. ఎంతో ఓపికతో మెలిగి ఈశాన్య రాష్ట్రాల్లో కమలం పార్టీ అధికారంలోకి వచ్చింది..  కమ్యూనిస్టుల కంచుకోట పశ్చిమ బెంగాల్ ని సైతం తన గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తుంది.  ఇప్పుడు కాషాయ దృష్టి తెలుగు రాష్ట్రాలపై పడింది..  ఇప్పటికే తెలంగాణ లో కొంత బలపడినట్లు అక్కడి పరిస్థితులను చూస్తే తెలుస్తుంది.. ఈ నేపథ్యంలో ఎలాంటి బలం లేని ఏపీ లో ఎలా బలపడేది అని బీజేపీ అలోచిస్తుంది.

ఆ కోవలోనే బీజేపీ కి ఏపీ లో జరుగుతున్న వరుస పరిణామాలు కలిసి వస్తున్నాయని చెప్పాలి.. ముఖ్యంగా హిందూ మనోభావాల పార్టీ అని పేరున్న బీజేపీ కి దేవాలయాల దాడులు బలపడడానికి ప్లస్ అంశాలు గా చెప్పాలి.. అయితే రాష్ట్రంలో దేవాలయాల దాడులు గతంలో జరగలేదా ఎందుకు అప్పుడు బీజేపీ పార్టీ అప్పుడు ఖండించలేదు అంటే గతంలో చంద్రబాబు నాయుడు తో పొత్తులో ఉన్న బీజేపీ పార్టీ దీన్ని పెద్దగా  ఇష్యూ చేయలేదు.. ఇప్పుడు ఉన్న రెండు పార్టీలను తొక్కేసి తనే అధికారంలోకి రావాలని చూస్తుంది కాబట్టి ఎలాగు హైలైట్ అవ్వాలి కాబట్టి సోము వీర్రాజు కాస్త దూకుడు పెంచారు..

ఈయనకు తోడు  సునీల్ డియోదర్ కూడా ఉండడంతో ఏపీ లో బీజేపీ పతి బలపడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అంటున్నారు.. త్రిపుర బీజేపీ ఇంచార్జిగా ఉన్న సునీల్ డియోదర్ ఇపుడు ఏపీకి ఇంచార్జిగా ఉన్నారు.ఆరెస్సెస్ నేపధ్యం ఉన్న సోము వీర్రాజు బీజేపీ రధ సారధిగా నియమితులయ్యారు.దీంతో ఒకే ఒరలో రెండు కత్తులు ఇమిడిపోయి పార్టీ ను అతి తొందరలోనే బలోపేతం చేస్తాయి అని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.. రాష్ట్రంలో జరిగే చిన్న పొరపాటును కూడా పదింతలు చేసి తప్పు చూపితే ప్రభుత్వం డిఫెన్సు లో పడి బలహీనపడుతుంది అప్పుడు బీజేపీ ఎంటర్ అయ్యి సమస్య ని పరిష్కారం చేసినట్లుగా చేస్తే ప్రజల్లో పేరు కి పేరు వస్తుందని ఆలోచన… ఇక ఇదే సీన్ కొనసాగితే మాత్రం కొత్త ఏడాది నాటికి ఏపీలో రాజకీయ వాతావరణం మారుతుంది అంటున్నారు. చూడాలి మరి జగన్ కౌంటర్ అటాక్ ఎలా ఉంటుందో..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -