Sunday, May 4, 2025
- Advertisement -

వైసీపీలో అసంతృప్తి సెగలు

- Advertisement -

ఏపీ క్యాబినెట్ పునర్ వ్యవస్థీకరణ కొందరిలో అసంతృప్తి సెగలకు కారణమైంది. కొత్త మంత్రుల జాబితాలో తన పేరు లేకపోవడంతో మంత్రి బాలినేని అలకబూనినట్లు తెలుస్తోంది. ఆయన్ను బుజ్జగించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని సమాచారం. స్వయంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన నివాసానికి వెళ్లి బాలినేనిని బుజ్జగించేందుకు ప్రయత్నించారు. అయినా బాలినేని అలుకపాన్పు వీడలేదని సమాచారం. పైగా ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన రాజీనామా లేఖను సజ్జలకు అందించినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు బాలినేని అనుచరులు ఆందోళనకు దిగారు. ఒంగోలులోని మంగమూరు రోడ్డు జంక్షన్‌ దగ్గర సీఎం జగన్ దిష్టిబొమ్మను తలబెట్టారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.

వైఎస్‌ఆర్‌సీపీలో సీనియర్ నేత, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మంత్రి వర్గంలో చోటు దక్కపోవటంతో భావోద్వేగానికి లోనయ్యారు. మంత్రివర్గంలో చోటు దక్కలేదని కన్నీళ్లు పెట్టుకున్నారు శ్రీధర్‌రెడ్డి. ఈసారి ఆయనకు మంత్రి పదవి తప్పక దక్కుతుందని భావించారు. జాబితాలో పేరు లేకపోవడంతో కార్యకర్తల సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్నారు.

మాచర్ల నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కలేదు. దీంతో ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. రెంటచింతల మండల కేంద్రంలోని ప్రధానరహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై టైర్లు తగలబెట్టారు.

పాత, కొత్త కలయికగా మంత్రివర్గ కూర్పు

హిందీపై అమిత్ షా వ్యాఖ్యలతో దుమారం

రాష్ట్ర ప్రజలకు టిఎస్ ఆర్టీసీ షాక్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -