Saturday, April 20, 2024
- Advertisement -

పాత, కొత్త కలయికగా మంత్రివర్గ కూర్పు

- Advertisement -

ఏపీలో చాలా రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. పాత, కొత్త కలయితతో మంత్రివర్గం కూర్పు జరిగింది. సామాజిక, రాజకీయ సమీకరణాలే ప్రాతిపదికగా కేబినెట్‌కు కూర్చినట్లు తెలుస్తోంది. పాత వారిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, నారాయణస్వామి, అంజాద్ బాషా, సీదిరి అప్పలరాజు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, విశ్వరూప్, తానేటి వనిత, గుమ్మనూరి జయరాంలకు రెండోసారి కూడా అవకాశం దక్కింది.

ఇక కొత్తగా ధర్మాన ప్రసాదరావు, కాకాని గోవర్ధన్‌ రెడ్డి, దాడిశెట్టి రాజా, విడదల రజని, రాజన్న దొర, గుడివాడ అమర్‌నాథ్‌, జోగి రమేష్‌, కారుమూరి నాగేశ్వరరావు, ముత్యాలనాయుడు, అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, ఆర్కే రోజా, తిప్పేస్వామి, కొట్టు సత్యనారాయణ, ఉషా శ్రీ చరణ్‌కు క్యాబినెట్‌లో చోటు దక్కింది.

మొత్తం 10 మంది పాతవారికీ, 15 మంది కొత్త వారికి క్యాబినెట్‌లో స్థానం లభించింది. కొత్త జిల్లాల్లో కొన్నింటికి అసలు ప్రాతినిధ్యం దక్కలేదు. కొన్ని జిల్లాల్లో ఇద్దరికి అవకాశం దక్కింది. చిత్తూరు నుంచి అయితే ఏకంగా ముగ్గురికి చోటు లభించడం విశేషం. చిత్తూరు జిల్లా నుంచి ఇప్పటికే పెద్దిరెడ్డి, నారాయణస్వామిలు మంత్రులుగా కొనసాగుతుండగా వారితో పాటు ఇప్పుడు ఆర్కే రోజాకూ అవకాశం దక్కింది. ఇక కొత్తగా ఏర్పడిన ఎన్టీఆర్, అన్నమయ్య, తిరుపతి జిల్లాలతో పాటు ప్రకాశం, విశాఖ జిల్లాలకు అసలు అవకాశం దక్కలేదు.

పూరీ మొదటి కల నెరవేర్చిన చిరంజీవి

హిందీపై అమిత్ షా వ్యాఖ్యలతో దుమారం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -