Wednesday, May 1, 2024
- Advertisement -

రాష్ట్ర ప్రజలకు టిఎస్ ఆర్టీసీ షాక్

- Advertisement -

రాష్ట్ర ప్రజలకు టీఎస్ ఆర్టీసీ మరో షాక్‌ను ఇచ్చింది. ఆర్టీసీ బస్సు ఛార్జీలను మళ్లీ పెంచుతున్నట్లు ఆ సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. డీజిల్ ధరలు పెరగడంతో సంస్థపై భారం పెరుగుతోందన్నారు. దీంతో పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో డీజిల్ సెస్ కింద 2 రూపాయలు పెంచుతున్నట్లు తెలిపారు. ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్, ఏసీ సర్వీసుల్లో 5 రూపాయలుగా నిర్ణయించినట్లు ప్రకటించారు.

ఈ ధరలు శనివారం నుంచి అమలులోకి వస్తాయని స్పష్టం చేశారు. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో కనీస ఛార్జీ 10 రూపాయలు ఉంటుందన్నారు. ప్రతి రోజు 6 లక్షల లీటర్ల ఆయిల్‌ను ఆర్టీసీ వినియోగిస్తోందన్నారు సజ్జనార్. ఇటీవల కాలంలో చమురు ధరలు అమాంతంగా పెరిగాయని..వీటిని దృష్టిలో పెట్టుకుని ఛార్జీలు పెంచినట్లు తెలిపారు. ఇటీవలే బస్సు ఛార్జీలను ఆర్టీసీ పెంచింది.

తాజాగా మళ్లీ పెంచడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. ఆర్థిక భారం పేరుతో ఛార్జీలు పెంచడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. బస్సు ఎక్కాలంటనే జేబులు ఖాళీ అవుతున్నాయని వాపోతున్నారు. పెంచిన ఛార్జీలపై పునరాలోచించాలంటున్నారు ప్రయాణికులు.

కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాల్

ఏపీ సీఎం ఢిల్లీ టూర్ ఆంతర్యం ఏంటి ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -