Monday, May 5, 2025
- Advertisement -

వైకాపాలోకి మాజీ సిఎం….. చంద్రబాబుకు షాక్

- Advertisement -

2019 ఎన్నికలకు జగన్‌కి టైం మామూలుగా కలిసిరావడం లేదు. 2014ఎన్నికల ముందు నుంచీ ఇప్పటి వరకూ బాబు చేసిన తప్పులన్నీ ఆయన మెడకు చుట్టుకుంటూ ఉన్నాయి. మరోవైపు జగన్‌కి మాత్రం అన్నీ కలిసొస్తున్నాయి. గతంలో జగన్‌కి వ్యతిరేకంగా పనిచేసినవాళ్ళు కూడా ఇప్పుడు జగన్ గెలుపు కోసం పరోక్షంగా సహకరిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. నాలుగున్నరేళ్ళ పాలనతో ప్రజలను, నాయకులను చంద్రబాబు అండ్ బ్యాచ్ ఆ స్థాయిలో నిరాశపరిచారని విశ్లేషకులు పరిస్థితులను విశ్లేషిస్తున్నారు. పచ్చ మీడియా ప్రతిరోజూ బాకా ఊదుతున్న విషయాలను పక్కనపెడితే జాతీయస్థాయి సంస్థల సర్వేలన్నింటినీ 2019 ఎన్నికల్లో జగన్ ఏకపక్షంగా విజయం సాధించబోతున్నాడనే చెప్తున్నాయి.

తాజాగా జగన్‌కి మరో బలం కలిసిరావడం ఖాయం అయింది. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య వైకాపాలో చేరడమో, లేకపోతే జగన్‌కి మద్దతుగా మాట్లాడడమో ఖాయమన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య రోశయ్య తరచుగా వైకాపా నేతలను కలుస్తున్నారు. బొత్ససత్యనారాయణతో సహా చాలా మందితో మంతనాలు జరుపుతున్నారు. వైశ్య వర్గం మొత్తం జగన్‌కి అండగా ఉండేలా వ్యూహరచనలు జరుగుతున్నాయని తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో చంద్రబాబు వైఖరితో విసిగిపోయి ఉన్న టీజీ వెంకటేష్…….ఆయన కొడుకు కూడా వైకాపావైపు చూస్తున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కర్నూలు అసెంబ్లీ టికెట్ టీజీ కొడుక్కి ఇవ్వకపోతే మాత్రం జంపింగ్ ఖాయం అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. రోశయ్యలాంటి నాయకుడు వైకాపాలో చేరినా, వైకాపాకు మద్దతుగా నిలబడినా రాజకీయ సమీకరణాల్లో చాలా మార్పులు వచ్చేస్తాయనడంలో సందేహం లేదు. వైకాపాలో చేరికలు, వైకాపాకు మద్దతుగా నిలబడుతున్న నాయకుల గురించి పచ్చ మీడియా వార్తలు రాకుండా చేయడం మినహా మరేమీ చేయలేకపోతున్న చంద్రబాబులో మాత్రం ఈ పరిణామాలు అసహనాన్ని కలిగిస్తున్నాయి. 2019లో జగన్‌ని ఓడించే సామర్థ్యంలేక, జగన్ ప్రజాదరణను ఎలా తగ్గించాలో తెలియక బాబుతో సహా పచ్చ బ్యాచ్ మొత్తం సతమవుతున్న నిజం మాత్రం ప్రతిరోజూ కంటికి కనిపిస్తూనే ఉన్నదని సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -