Friday, March 29, 2024
- Advertisement -

జగన్ నయా ప్లాన్ ..?

- Advertisement -

వైయెస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా పదవి బాద్యతలు చేపట్టిన తరువాత ఎన్నో విషయాలలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నాడు. ముఖ్యంగా దేశంలో ఎక్కడ లేని మూడు రాజధానుల ప్రస్తావనను తెరపైకి తెచ్చి రాష్ట్రంలో కొత్త రేజకీయ ఎత్తుగడాలకు తెరతీశారు. విశాఖాను పాలన రాజధానిగాను, అమరావతిని శాసన రాజధానిగాను, కర్నూలు ను జ్యుడీషియల్ రాజధానిగాను ప్రకటించాలని జగన్ సర్కార్ చూసింది. జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అన్నీ రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ముఖ్యంగా అమరావతి ప్రాంత రైతుల నుంచి ఈ మూడు రాజధానుల ప్రస్తావనపై ఇప్పటికీ కూడా ఉద్యమం కొనసాగుతూనే ఉంది. .

ఈ వివాదం కోర్టు వరకు కూడా చేరుకోగా, చివరకు అమరావతి రైతులకు అనుంకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. దాంతో మూడు రాజధానుల బిల్లు ను ప్రభుత్వం వెనక్కి తీసుకోక తప్పలేదు. ఇదిలా ఉంచితే సి‌ఎం జగన్ కు మాత్రం అమరావతి కేంద్రంగా పలిపాలన సాగించడం ఏమాత్రం ఇష్టం లేదని రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్న మాట. అందుకే ఆయన పరిపాలన కార్యకలపాలన్నీ విశాఖ నుంచి చేయాలని భావిస్తున్నారట. కానీ అమరావతి ప్రాంతంలో నష్టపోయిన రైతులకు మౌలిక వసతులపై కల్పించడంపై దృష్టి పెట్టాలని కోర్టు నుంచి ఆదేశాలు రావడంతో చేసేదేమీలేక మనసు చంపుకొని అమరావతిలోనే సి‌ఎం జగన్ పాలన సాగిస్తున్నారట. అయితే సి‌ఎం జగన్ మనసు మాత్రం విశాఖ వైపే ఉందనే వాదనలు వస్తున్నాయి. ఇక రాబోయే ఎన్నికలకు జగన్.. ప్రణాళికలతో ఇప్పటినుంచే సిద్దమౌతున్న సంగతి తెలిసిందే. ఇటీవల నిర్వహించిన ప్లీనరీ లో ఎన్నికలకు సిద్దంగా ఉండాలంటు పార్టీ నేతలకు సూచించరాయన. ఇక నవంబర్ నుంచి వైఎస్ బస్సు యాత్ర కూడా చేపట్టబోతున్నట్లు వైసిపి వర్గాల్లో వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికలకు తదుపరి ప్రణాళికలు అన్నీ విశాఖ కేంద్రంగా నిర్వహించాలనేది జగన్ ప్లాన్ అని తెలుస్తోంది. అందుకోసం సి‌ఎం కార్యాలయాన్ని విశాఖకు మార్చే ఆలోచనలో ఉన్నారట. అయితే విశాఖ కేంద్రంగా పరిపాలన సాగిస్తే.. పెండింగ్ లో ఉన్న మూడు రాజధానుల విషయంపై ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందువల్ల కేవలం సి‌ఎం కార్యాలయాన్ని విశాఖలో ప్రారంభించి, అటు పార్టీ కార్యాచరణను, ఇటు ప్రభుత్వ కార్యకలాపాలను విశాఖ నుంచి అమలు చేయాలని జగన్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. విశాఖలో సి‌ఎం కార్యలయం ప్రారంభం కూడా ఎంతో దూరంలో లేదని, ఆగష్టులో దీనికి సంభంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి అమరావతి కాదని విశాఖలో సి‌ఎం ఆఫీస్ పెడితే.. ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యే అవకాశం ఉంది. మరి విశాఖ విషయంలో జగన్ ఎలా వ్యవహరిస్తారో చూడాలి.

More Like This

హీటెక్కిస్తున్నా సర్వే ఫలితాలు ?

బాబు చూపు .. బీజేపీ వైపు ?

పవన్ కలవరం.. అందుకేనా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -