Saturday, April 27, 2024
- Advertisement -

జగన్నాటకం.. అంతా నాఇష్టం !

- Advertisement -

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా వైసీపీ పార్టీ రెండు రోజుల పాటు గుంటూరులో నిర్వహించిన ప్లీనరీ సమావేశాలు ముగిశాయి. ఈ ప్లీనరీ సమావేశాలలో దాదాపుగా పది తీర్మానలపై చర్చించి ఆమోదించారు. అందరూ ఊహించిన్నట్టుగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ కి శాశ్వత కల అద్యక్షుడిగా కొనసాగనున్నారు. ఇక రాబోయే ఎన్నికలకు కూడా సిద్దమవ్వలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు సి‌ఎం జగన్. అయితే ఈ ప్లీనరీ సమావేశాలలో చోటు చేసుకున్నా కొన్ని ఆసక్తికర అంశాలు.. ప్రజల్లో కొన్ని ఆలోచనలు రేకెత్తిస్తున్నప్పటికి, అదంతా కూడా వైఎస్ జగన్ ప్రణాళికలో భాగమేననే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. .

ముఖ్యంగా వైఎస్ జగన్ తల్లి విజయమ్మ వైసీపీ గౌరవ అద్యక్షురాలి పదవికి రాజీనామా చెయ్యడం వెనుక జగన్ వ్యూహం ఉందనేది ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే విజయమ్మ రాజీనామా ప్రకటన చేసే సమయంలో వైసీపీ కార్యకర్తలు వద్దు వద్దు అంటూ నినాదించారు. కానీ వైఎస్ జగన్ మాత్రం చిరునవ్వుతో స్వాగతించారు. విజయమ్మకు రాజీనామా చెయ్యడం ఏమాత్రం ఇష్టం లేదని ఆమె మాటల్లో తడబాటుకు గురైన విధానం చూస్తే అర్థమౌతుంది. కానీ తప్పని పరిస్థితుల్లో రాజీనామా చేయాల్సి రావడం విజయమ్మ జీర్ణించుకోలేకపోతున్నారట. విజయమ్మ రాజీనామా చేసే సమయంలో ఏం మాట్లాడాలో ఒక లెటర్ ద్వారా సూచించినట్లు తెలుస్తోంది. తన ప్రమేయం లేకుండా తన సంతకంతో వచ్చిన లెటర్ గురించి స్వయంగా విజయమ్మనే ప్రస్తావించడం గమనార్హం. దాంతో తనవల్ల ఇబ్బందులు రాకూడదని, అందుకే రాజీనామా చేస్తున్నట్లు విజయమ్మ ప్రకటించారు.

అయితే వైఎస్ జగన్.. తల్లిని కూడా ఈ విధంగా దూరం పెట్టడానికి గల కారణాలు ఏవని పరిశీలిస్తే.. కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నా దాని ప్రకారం.. జగన్ పై ఉన్న అవినీతి కేసుల విషయంలో కేంద్రం గట్టిగానే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఒకవేళ తనకు శిక్ష పడితే తన స్థానంలో సతీమణి భారతిరెడ్డి ని ముఖ్యమంత్రి చేసేందుకే వైసీపీ గౌరవ అధ్యక్ష పదవి నుంచి విజయమ్మను తప్పించారట. విజయమ్మ గౌరవ అధ్యక్షురాలి పదవిలో ఉంటే ముఖ్యమంత్రి బాద్యతలు విజయమ్మనే చేపట్టే అవకాశం ఉంది. అప్పుడు జగన్ సొంత నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటుకు గురైయ్యే అవకాశం ఉంది. అందుకే భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా విజయమ్మ చేత ముందుగానే వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంచితే భవిష్యత్తులో వేరే వారికి అవకాశం ఇవ్వకుండా వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా కొనసాగేందుకు వైఎస్ జగన్ నిర్ణయంచుకున్నారంటే.. పదవి పట్ల వైఎస్ జగన్ కు ఏ స్థాయిలో వ్యామోహం ఉందో అర్థం చేసుకోవచ్చు.

Also Read

ఈటెల కు ప్రాధాన్యం ఇవ్వని బీజేపీ ?

విడ్డూరం : మూడు పార్టీల్లో “జంపింగ్ జపాంగ్ ” ?

రెండవసారి.. నో చెప్పిన వెంకయ్య ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -