తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు విడుదలైయ్యాయి.రాష్ట్రంలో తిరిగి టీఆర్ఎస్ పార్టీ అధికారం చెజిక్కిచుకుంది.అయితే ఫలితాలపై మొదట ఎవరికి అనుమానం లేదు.అందరికి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని భావించారు. కాని సర్వేల రారాజు లగడపాటి ఎంట్రీ ఇచ్చిన తరువాత సీన్ మొత్తం మారిపోయింది.తన సర్వేలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని మహకూటమి అధికారంలోకి వస్తుందని వెల్లండించారు.దీంతో చాలామంది లగడపాటి సర్వేని నమ్మి కొన్ని వందల కోట్లు పందెలు కట్టారు.అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయింది.లగడపాటి సర్వే తలకిందులైంది.
టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చింది.టీఆర్ఎస్ 88 సీట్లలో విజయం సాధించగా,మహకూటమి 21 సీట్లలో మాలత్రమే విజయం సాధించింది.లగడపాటి సర్వేని నమ్ముకున్న ఓ ఆంధ్ర రైతు తన దగ్గర ఉన్న 10 ఏకరాలను పందెం కట్టాడు.పాపం ఇప్పుడు ఆ పది ఏకరాలను వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.ఆ రైతు పందెం కట్టింది కూడా మరెవ్వరితోనే కాదు ఆ ఏరియా మాజీ ఎమ్మెల్యేతోనే పందెం కట్టి మోసపోయాడు.మనకు తెలిసి ఈ రైతు ఒక్కడే,ఇలా లగడపాటిని నమ్మి చాలామంది కొన్ని వందల కోట్లు పొగొట్టుకున్నట్లు సమాచారం.
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’