Sunday, May 5, 2024
- Advertisement -

సీ – ఓటరు సర్వే..మరో లగడపాటి సర్వేనే!

- Advertisement -

ఆంధ్రా ఆక్టోపస్ అంటే గుర్తుకొచ్చేది మాజీ ఎంపీ లగడపాటి. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెప్పిన లగడపాటి ఆ తర్వాత సర్వేల పేరుతో హల్ చల్ చేశారు. అయితే 2019లో లగడపాటి చెప్పిన సర్వే బుమారాంగ్ అయింది. 2019లో టీడీపీ గెలుస్తుందని, పవన్ అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నాడని చెప్పారు. కానీ వైసీపీ సునామీలో టీడీపీ కొట్టుకుపోయింది.

ఇప్పుడు ఇదే సీ ఓటర్ సర్వే చేస్తోంది. సీ – ఓటర్ అనే సంస్థ చేసిన సర్వేలో తెలుగుదేశానికి 17 లోక్ సభ స్థానాలు వస్తాయని చెప్పిన రోజునుంచీ టీడీపీ వెనకా ముందూ ఆలోచించకుండా ఎగిరెగిరిపడుతున్నారు. కానీ వాస్తవానికి ఆ సంస్థ విశ్వసనీయత ఏపాటిది అనేది వాళ్ళు గుర్తించడం లేదు

తెలుగుదేశం గెలిచేసిందని, ఇక మనకు తిరుగులేదని సంబరపడుతున్న టీడీపీ శ్రేణులకు ఒక విషయం మాత్రం అర్థం కావడం లేదు.. ఒక సంస్థ.. ఒక వ్యక్తి లేదా ఒక సమస్త ఏదైనా ఒక మాట చెబితే దాన్ని నమ్మాలా ? ఎంత వరకు నమ్మాలన్నది ఆ సంస్థకున్న విశ్వసనీయత బట్టి ఉంటుంది.గతంలో వాళ్ళు చెప్పిన మాటలు నిజమయ్యాయా లేదా అనేది చూసుకుని వాటిని పరిగణనలోకి తీసుకుంటారు

ఇక సీ – ఓటర్ సంస్థ 2023 లో ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెసుకు 53 వరకు సీట్లు వస్తాయని చెప్పగా చివరకు 35 సీట్లే వచ్చాయి .. 54 సీట్లతో బిజెపి అధికారంలోకి వచ్చింది.మధ్యప్రదేశ్ లో కాంగ్రెసుకు 133 ఎమ్మెల్యే సీట్లు వస్తాయని చెబితే కేవలం 66 సీట్లే వచ్చాయి.. అంతిమంగా 163 సీట్లతో బీజేపీ అధికారాన్ని ఎగరేసుకు పోయింది.ఇక ఈ సంస్థ 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 100 వరకు అసెంబ్లీ సీట్లు వస్తాయని , 14 ఎంపీ సీట్లు వసాయని చెబితే చివరకు మూడు ఎంపీలు.. 23 ఎమ్మెల్యే సీట్లతో చతికిలపడింది..అలాంటి సీ ఓటర్ సర్వే పట్టుకుని తెలుగుదేశం ఎలా సంబరపడిపోతుందో అర్థం కావడం లేదని విశ్లేషకులు నవ్వుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -