Thursday, May 16, 2024
- Advertisement -

వైసిపి లో వర్గపోరు సిఎం దిగివచ్చినా ఆగదా..!!

- Advertisement -

వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గరినుండి ఇప్పటి వరకు ఒక్క మచ్చ లేకుండా పరిపాలన కొనసాగిస్తూ వస్తుంది. కొన్ని కొన్ని అభియోగాలు వచ్చినా అవి బలవంతంగా పార్టీ పైనా ప్రతిపక్షాలు రుద్దినవే తప్పా స్వయంగా పార్టీ చేసిన దాఖలాలు ఇప్పటివరకు లేవు.. జగన్ ఎంతటి సమర్దవంతంగా పాలన సాగిస్తున్నాడో రాష్ట్రంలోని ప్రశాంతత ని చూస్తే అర్థమవుతుంది. ఇక ప్రతిపక్షాలు అలానే అరుస్తుంటాయని వాటిని పట్టించుకోకుండా పనిచేయాలని ఇప్పటికే జగన్ ఆదేశాలు ఇచ్చారట.. అంతా బాగానే ఉన్నాయి కానీ పార్టీ లో కొన్ని నియోజక వర్గాల్లో అంతర్గత విభేదాలు పార్టీ ప్రతిష్ట ని దెబ్బతీసేలా ఉన్నాయి..ముఖ్యంగా రాయలసీమ కర్నూల్ లో ఈ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి..  

ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిలు రెండు గ్రూపులు కావడంతో అక్కడి వైసీపీ కార్యకర్తలు కొంత అయోమయానికి గురవుతున్నారట.. అయితే వీరి మధ్య మొదటి నుంచి ఈ విభేదాలు ఉన్న అధిష్టానం పట్టించుకోలేదట.. 2014 లో వైసీపీ తరపునుంచి పోటీ చేసిన ఎస్వీ మోహన్ రెడ్డి ఆ తర్వాత టీడీపీ లోకి వెళ్ళిపోయారు.. ఆ తర్వాత ఎన్నికల కు ముందు మళ్ళీ వైసీపీ లోకి వచ్చారు.. అయితే అప్పటికే హఫీజ్ ఖాన్ టికెట్ ఇచ్చిన పార్టీ మోహన్ రెడ్డి కి హఫీజ్ ఖాన్ గెలుపుకోసం కృషి చేయమని చెప్పగా అయన అలానే చేశారు.. అయితే హఫీజ్ ఖాన్ గెలిచినా తరువాత మోహన్ రెడ్డి ఆధిపత్యం ఎక్కువయిందట..

ప్రతి విషయంలోనూ ఎస్వీ మోహన్ రెడ్డి జోక్యం చేసుకుంటుండటం హఫీజ్ ఖాన్ కు ఇబ్బందిగా మారింది.దీన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళినా అదే సమసిపోతుందనుకున్నారు.. ఇక నామినేటెడ్ పనులను తన వర్గానికే ఇవ్వాలని ఎస్వీ మోహన్ రెడ్డి పట్టుబడుతుండటంతో హఫీజ్ ఖాన్ ఆయనను కలిసేందుకు కూడా ఇష్టపడటం లేదు. దీంతో అధికారులపై వత్తిడి చేసి మరీ తన వర్గానికే నామినేటెడ్ పనులను హఫీజ్ ఖాన్ కేటాయించుకున్నారు.దీంతో అగ్గిమీద గుగ్గిలం అవుతున్న ఎస్వీమోహన్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు.. మొత్తం మీద కర్నూలు వైసీపీలో గ్రూపు తగాదాలు తీవ్రమవువుతన్నా అధిష్టానం మాత్రం పట్టించుకోకపోవడం క్యాడర్ లో చర్చనీయాంశమైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -