Thursday, April 25, 2024
- Advertisement -

గంటా గురి మంత్రి పదవికే..!

- Advertisement -

అమరావతి విషయం వల్ల రాష్ట్రంలోని అందరు టీడీపీ నేతలు, వైసీపీ నేతలు ఎంతో హాయిగా ఉంటున్నారు కానీ విశాఖ లోని టీడీపీ నేతలు మాత్రం ఈరోజు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో తెలీక దినదినగండంగా గడుపుతున్నారు.. వైసీపీ అధికారంలోకి రావడం పై వారికి ఏమాత్రం అభిప్రాయ తేడాలు లేవు.. ఎందుకంటే ఒకరోజు ఒక పార్టీ లొ ఉంటుంది, ఇంకో రోజు ఇంకో పార్టీ అధికారంలో ఉంటుంది..కానీ వైసీపీ పార్టీ వచ్చి రాజధాని మార్పు చేసి తమను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టిందన్న భావన అయితే వారిలో ఉంది..  వీరి పరిస్థితి ఎలా ఉందంటే కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లు ఉంది.. అమరావతి రాజధాని కావాలంటే విశాఖ కు కోపం, విశాఖ కి కావాలంటే టీడీపీ కి కోపం అన్నట్లు తయారైంది..

ఈ టెన్షన్ భరించలేకే చాలామంది టీడీపీ నేతలు వైసీపీ కి వచ్చి సేఫ్ అవుతున్నారు.. ఈ నేపథ్యంలో ఇప్పటికే విశాఖ లో కీలక నేతలు టీడీపీ లో కి రాగ ఇప్పుడు గంటా శ్రీనివాస్ రావు రాక కూడా ఖరారు కావడంతో రాష్ట్రంలో చాలా ఆసక్తి నెలకొంది.. అయితే వైసీపీ అడిగితే తాను వైసీపీ లోకి వస్తున్నట్లు గంటా ప్రవర్స్తిన్నారని తెలుస్తుంది. రాజీపడి వైసీపీలో చేరడానికి గంటా శ్రీనివాసరావు మనసు అసలు ఒప్పుకోవడంలేదుట. తాను సీనియర్ మోస్ట్ లీడర్ని అని పైగా మంత్రిగా పనిచేసిన వాడిని అని గంటా అంటున్నట్లుగా చెబుతున్నారు. జగన్ కనుక వైసీపీలో చేరమంటే కచ్చితంగా టీడీపీకి ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే సీటుకు రాజీనామాయే చేసి వస్తానని గంటా శ్రీనివాసరావు చెబుతున్నారని టాక్. తనది రాజమార్గమని, అందుకే తాను దర్జాగానే వైసీపీ అధికార సభ్యుడిని అవుతాను అంటున్నారు.

మొదటినుంచి పథకం ప్రకారమే గంటా ప్రవర్తిస్తూ ఉన్నారు.. తనకు తానుగా వైసీపీ లోకి వెళ్లాలని చెప్పకుండా వైసీపీ నేతల నోటివెంట అయన రావద్దు అని చెప్పొస్తూ తనపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా చేశారు.. ముందుగా తన కొడుకుని చేర్చి తాను అనుబంధ సభ్యుడిగా ఉంటే మజా ఏముంటుందని ఆలోచిస్తున్నారు. తాను మళ్లీ గెలిచి వైసీపీ ఎమ్మెల్యే కావాలని ఆయన బలంగా కోరుకుంటున్నారు. జగన్ వేవ్ లోనే గెలిచిన తనకు అధికార పార్టీ తరఫున గెలవడం ఏమంత కష్టం కాదని ఆయన నమ్ముతున్నారు. ఇలా గెలిచి వచ్చిన తరువాత మంత్రి పదవికే ఆయన గురి పెడతారు అని కూడా అంటున్నారు.

చంద్రబాబు 40 ఇయర్స్ రాజకీయం ఇదేనా…?

జంపింగ్ జపాంగ్‌లను పక్కన పెట్టిన బాబు..!

చంద్రబాబు ఇలాంటి రాజకీయాలు ఎవరికోసం..?

అమరావతి ని చంద్రబాబు పక్కకు పెడితే మంచిది..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -