Sunday, April 28, 2024
- Advertisement -

అమరావతి ని చంద్రబాబు పక్కకు పెడితే మంచిది..?

- Advertisement -

రాష్ట్రంలో మూడు రాజధానుల వ్యవహారం ఇప్పుడిప్పుడే సమసి పోతుంది..ఒకప్పుడు ప్రతిపక్షాలు ఎందుకు దీన్ని ఇంతలా వ్యతిరేకిస్తున్నాయో వైసీపీ కి అర్థం కావట్లేదని ఆయా వర్గాలు ఆవేశాన్ని కలుగజేశాయి.. స్వంత ప్రయోజనాల కోసం ఈ ప్రాంతాన్ని, ప్రాంత ప్రజలని వాడుకుంటూ వారి ప్రాంత అభివృద్ధిని చేజేతులా దూరం చేశారు టీడీపీ వారు.. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ మాత్రం ఈ అంశాన్ని వదిలిపెట్టకపోగా జగన్ పై రోజు రోజు కి పెరిగిపోతున్న అభిమానాన్ని తట్టుకోలేక దుమ్మెత్తి పొసే ప్రయత్నం చేసింది.. ఇక ఈ ప్రాంతపు టీడీపీ లీడర్లు తప్ప ఇతర ప్రాంత టీడీపీ లీడర్లు ఎవరు మూడు రాజధానుల విషయం పై స్పందించట్లేదు అని చెప్పాలి..

ఇక తాజాగా ఇటీవలే విజయావాడకు చేరుకున్నారు. అయినప్పటిక్కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలను నేరుగా కలిసేందుకు ఆయన ఒప్పుకోవడం లేదట. దీంతో పెద్దాయనొస్తారు.. కుమ్మేద్దాం.. అనుకున్న కేడర్‌ నీరసించిపోతోందంటున్నారు. దీనికితోడు ఇక్కడ్నుంచి కూడా జూమ్‌ మీటింగ్‌లోనే చంద్రబాబు మాట్లాడుతూ పలు ఆదేశాలు కూడా ఇచ్చేస్తున్నారట.

అమరావతి ఉద్యమం విషయంలో చంద్రబాబు ఇంకా గట్టి పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల ప్రజల అభిప్రాయాలతో సంబంధం లేకుండా అమరావతే రాజధానిగా ఉండాలని తెలుగుదేశం పార్టీ తీర్మానం చేసేసింది. అదే తీర్మానానికి కట్టుబడి ఉండాలని ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని టీడీపీ నాయకులపై కూడా ఒత్తిడి తెస్తోంది. అయితే ఈ ధోరణి నచ్చక కొంతమంది వైసీపీ లోకి వెళ్లగా చంద్రబాబు కు అక్కడ ఎవరు పోరాటం చేసేది అని అంటున్నారు. అయినప్పటికీ పరిస్థితిని అర్ధం చేసుకోకుండా ఇంకా అమరావతి పోరాటం అంటూ చంద్రబాబు మరోసారి పిలుపునివ్వడం, అన్ని ప్రాంతాల వారిని అందులో భాగస్వాములు కావాలని ఆదేశాలివ్వడమే సొంత పార్టీ నాయకుల నుంచి కూడా ఆక్షేపణలు కారణమవుతోంది. అయిపోయిందేదో అయిపొయింది అనుకుని చంద్రబాబు దీన్ని పక్కన పెట్టి ప్రజలకు పనికొచ్చే విషయంపై పోరాటం చేస్తే వచ్చే ఎన్నికల నాటికి ప్రజలు కొంతైనా నమ్మే పరిస్థితి కనిపిస్తుంది..

టీడీపీ నాశనానికి బీజేపీ కి కూడా ఓ కట్టే వేస్తుందా..?

అప్పుడు ప్రతీకారం.. ఇప్పుడు భజన.. ఏదైనా బాబు..బాబే..!

టీడీపీ నాశనానికి చంద్రబాబె ముఖ్య కారణమా..?

టీడీపీ కి వారే శత్రువులుగా మారుతున్నారా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -