ప్రభాస్ మూవీకోసం అమితాబ్ కి ఎంత ఇస్తున్నారో తెలుసా ?

- Advertisement -

వైజయంతీ మూవీస్ బ్యానర్ 50ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రతిష్టాత్మకంగా ఓ సినిమాని తీస్తున్నాడు. సైంటిఫిక్ కథాంశంతో వస్తున్న ఈ సినిమాని భారీ బడ్జెట్ తో ఎక్కడ వెనుకాడకుండా అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. నాగ్ అశ్విన్ తెరకెక్కించే ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ క్రేజీ స్టార్లతో సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీలో బిగ్ బి అమితాబ్ ఓ స్పెషల్ రోల్ చేయబోతున్నారు. బిగ్ బి అడిగినంత పారితోషికం ఇచ్చేందుకు నిర్మాతలు సై అనడంతో ఆయన ఒప్పుకున్నారు. ఈ మూవీలో అమితాబ్ పాత్ర దాదాపు 25నిమిషాలపాటు ఉంటుందని తెలుస్తోంది. ఇందుకోసం నిర్మాతలు అమితాబ్ కు రూ.25కోట్ల మేరకు పారితోషికం ఇవ్వనున్నారని సమాచారం. అలానే షూటింగ్ మొత్తం ముంబైలో చిత్రీకరిస్తామని దర్శకుడు నాగ్ అశ్విన్ ఆయనకు హామీ ఇచ్చారట.

దీంతో ఈ మూవీలో నటించేందుకు బిగ్ బీ అంగీకరించినట్లు తెలుస్తోంది. బిగ్ బీ ఈ మూవీలో నటిస్తే హిందీ మార్కెట్ బాగుంటుందని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత నాగ్ అశ్విన్ మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది.

మహేష్ బాబుకు ఇష్టమైన హీరో ఎవరో తెలుసా ?

లూసిఫర్ రీమేక్ విషయంలో వినాయక్ కి చిరు పెద్ద షాక్..?

దట్ ఈజ్ పవర్ స్టార్.. రోజుకి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

షాకింగ్ : బిగ్‌బాస్ నుంచి గంగవ్వ బయటకు.. ఎందుకంటే ?

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -