- Advertisement -

మీడియాపై విజయం సాధించిన పవర్ స్టార్….. నారా రాజకీయం ముందు చతికిలపడ్డాడా?

- Advertisement -

2019 ఎన్నికల్లో టిడిపికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ పోటీ చేయడం ఖాయం అన్న విషయం తెలిసినప్పటి నుంచీ కూడా టిడిపి మీడియా జనాలు రెచ్చిపోయారు. మహేష్ కత్తి, పూనం కౌర్‌ల నుంచీ శ్రీరెడ్డి వరకూ అన్ని ఆయుధాలనూ వాడేసి పవన్ ప్రతిష్టను, వ్యక్తిత్వాన్ని ఎంతలా దెబ్బకొట్టాలో అంతా ప్రయత్నం చేశారు. అయితే మొత్తం కుట్రను పసిగట్టిన పవన్ కళ్యాణ్……. అదే మీడియా ముందుకు వచ్చి రాధాకృష్ణ, రవిప్రకాష్‌లాంటి వాళ్ళతో కలిసి నారా లోకేష్ నడిపించిన మొత్తం రాజకీయ కుట్రను బయటపెట్టేశాడు. ఆ తర్వాత కూడా వరుసగా టిడిపి భజన మీడియాపై సాక్ష్యాలతో సహా పవన్ బయటపెట్టిన ఫోటోలు, వీడియోలతో మీడియా గురువులు అని పిలిపించుకునే రవిప్రకాష్, రాధాకృష్ణలు కూడా పూర్తిగా సైలెంట్ అయిన పరిస్థితి. పవన్ ఇచ్చిన ధైర్యంతో ఇప్పుడు చిన్న హీరోలయిన మంచు మనోజ్, సాయి ధరమ్ తేజ్‌లు కూడా మీడియాపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

అయితే మీడియాపై ఘనవిజయం సాధించిన పవన్ నారా వారిపై మాత్రం అదే స్థాయిలో పై చేయి సాధించలేకపోయాడు. నిజానికి నారావారిపై యుద్ధం చేసి ఉంటే పవన్ కళ్యాణ్ గెలిచి ఉండేవాడేమో. కానీ వెన్నుపోటుకు, తెరవెనుక రాజకీయాలకు మాత్రమే అలవాటుపడిన నారా వారు పవన్‌కి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. పవన్‌తో ముఖాముఖి యుద్ధానికి తోక ముడిచారు. పవన్ వెనకాల ఉండి ఎవరో నడిపిస్తున్నారు. ఇప్పటికీ పవన్‌పై గౌరవం ఉంది లాంటి డైలాగులతో చంద్రబాబు, లోకేష్‌లు పవన్ కళ్యాణ్ ముందు సాగిలపడ్డారు. దాంతో పవన్‌కి పెద్దగా ఛాన్స్ లేకుండా పోయింది అన్నది విశ్లేషకుల మాట. అయితే తెర ముందు మాత్రం పవన్ కళ్యాణ్ అంటే అభిమానం, గౌరవం అని చెప్పే నారా వారు తెరవెనుక మాత్రం ఈ సారి జనసేనుడి పార్టీ మూతపడేస్థాయి వ్యూహాలు రచిస్తారనడంలో సందేహం లేదని వెన్నుపోటు కాలం నుంచీ బాబు నైజం చూస్తున్న సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి అయితే మాత్రం తనకు వ్యతిరేకంగా రెచ్చిపోతున్న టిడిపి మీడియా మొత్తం నోర్మూసుకునేలా చేయడంలో పవన్ సూపర్ సక్సెస్ సాధించాడు. కానీ అదే ఊపులో చంద్రబాబు, లోకేష్‌లను కూడా ఒక ఆటాడుకుందామనుకున్న పవన్‌కి నారా వారు ఆ అవకాశం ఇవ్వకుండా పవన్‌పై అభిమానం, గౌరవం అంటూ తెరముందు నాటకాన్ని ప్రదర్శించారు. మరి టిడిపి క్యాంప్ మొత్తానికి పవన్ ఇప్పుడిచ్చిన షాక్‌ని పచ్చ బ్యాచ్ మొత్తం ఎప్పటికీ మర్చిపోదు. అలాగని తెరముందే రెచ్చిపోయే రాజకీయం నారా వారిది కాదు. తెరవెనుక రాజకీయ వ్యూహాలు మాత్రం ఓ రేంజ్‌లో ఉంటాయి. అందుకే చిరంజీవి కూడా ప్రజారాజ్యాన్ని మూసేయాల్సి వచ్చింది. ఇప్పుడు అదే స్థాయి వ్యూహాలతో పవన్‌ని కూడా దెబ్బకొట్టాలని చూడడం ఖాయం. మరి ఆ వ్యూహాలను కూడా పవన్ ముందుగానే పసిగడతాడా? జనసేన పార్టీని నిలబెడతాడా? చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -