Saturday, May 3, 2025
- Advertisement -

ఎన్నికలకు జగన్ భయపడుతున్నారా ? ఎందుకు మాట మార్చారు ?

- Advertisement -

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడున్నర ఏళ్ళు పూర్తయింది. మరో ఏడాదిన్నరలో సార్వత్రిక ఎన్నికల సమరం మొదలౌతుంది. గత ఎన్నికల్లో కనీవినీ ఎరుగని విజయాన్ని అందుకున్న వైసీపీ.. వచ్చే ఎన్నికల్లో అంతకు మించి విజయం సాధించేందుకు 175 స్థానాలను టార్గెట్ గా పెట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలని ఇప్పటికే వైఎస్ జగన్ గట్టి ప్రణాళికలు వేసి వైసీపీ నేతలకు దిశానిర్దేశం కూడా చేశారు..

సరే ఈ విషయాన్ని అలా ఉంచితే ఆ మద్య ఏపీలో ముందస్తు ఎన్నికల చర్చ జోరుగా సాగింది. ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయమనే సంకేతాలు కూడా గట్టిగానే వచ్చాయి. సి‌ఎం జగన్ కూడా పలు సందర్భలో ” ఎన్నికలు ఎప్పుడు వచ్చిన సిద్దంగా ఉండాలని.. ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఇక ఆ తరువాత కారణలేవైనప్పటికి ముందస్తు ఎన్నికల ప్రస్తావనే ఎక్కడ కనిపించలేదు. కానీ ఇటీవల వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ముందస్తు ఎన్నికల విషయంలో స్పందిస్తూ.. ” ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ప్రసక్తే లేదని, సాధారణంగానే ఎన్నికలకు వెళ్తామని ” తేల్చి చెప్పారు. అయితే ముందస్తు ఎన్నికల విషయంలో మొదట వైసీపీ సానుకూలంగా స్పందించి ఇప్పుడేందుకు వెనుకడుగు వేస్తోంది అనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

ఎందుకంటే వైఎస్ జగన్ పలు సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నప్పటికి.. ఆయన పరిపాలనపై పెదవివిరిచే వారు కూడా లేకపోలేదు. జగన్ పరిపాలనలో నిత్యవసర ధరల పెరుగుదల, ఇసుక విధానాలు, రేషన్ సరుకులు.. ఇలా చాలా వాటిలో జగన్ వైకరిని రాష్ట్ర ప్రజలు తప్పుబడుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ముందస్తు ఎన్నికలకు వేస్తే..కచ్చితంగా ప్రజల నుంచి ఊహించని షాక్ తగిలే అవకాశం ఉందని పలువురి వాదన. అందుకే ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండడంతో.. ఈ ఏడాదిన్నర కాలంలో ప్రజలకు ఉపయోగకరంగా మరికొన్ని పథకాలు ప్రవేశ పెట్టి సాధారణ ఎన్నికల బరిలో దిగాలని వైసీపీ చూస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ముందస్తు ఎన్నికల విషయంలో జగన్ కాస్త వెనుకడుగు వేసినట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట.

Also Read

జగన్ కు సర్పంచులు షాక్ ఇవ్వనున్నారా ?

బాలీవుడ్ పై బాలయ్య, బోయపాటి దండయాత్ర !

పులివెందుల సీటు సునీతకే.. మరి జగన్ పరిస్థితి ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -