Sunday, April 28, 2024
- Advertisement -

పులివెందుల సీటు సునీతకే.. మరి జగన్ పరిస్థితి ?

- Advertisement -

ఏపీలో 2019 ఎన్నికల ముందు వైఎస్ వివేకా హత్య ఏ స్థాయిలో సంచలనం అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ కూడా ఆ హత్యకు సంబంధించిన పూర్తి ఆధారాలు బయటకు రాకపోవడం గమనార్హం. తన తండ్రి హత్య కేసులోని నిజాలను నిగ్గు తేల్చాలని వైఎస్ వివేకా కూతురు వైఎస్ సునీత సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి కూడా విధితమే. అయినప్పటికి ఈ కేసు అనుకున్నంతగా ముందుకు కదలడం లేదు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితులుగా వైఎస్ జగన్ అనుచరులు ఉన్నారని గత కొన్నాళ్లుగా పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ రకంగా వార్తలు రావడానికి కూడా కారణం లేకపోలేదు. వైఎస్ వివేకా హత్య గావించబడ్డప్పుడు అప్పుడు ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ కేసును ముందుకు సాగించడం లేదని, చంద్రబాబు ప్రభుత్వంపై తనకు నమ్మకం లేదని జగన్ బహిరంగ వ్యాఖ్యలు చేశారు. అయితే 2019 ఎన్నికల తరువాత అధికరంలోకి వచ్చిన జగన్ తన బాబాయి హత్య కేసు ను ఎందుకు ప్రస్తావించడం లేదని విమర్శలు వస్తున్నాయి.. దీంతో జగన్ తీరుపై అసహనంగా ఉన్న వివేకా కూతురు సునీత ఒంటరిగానే పోరాడుతూ తన తండ్రిని చంపిన వారిని బహిర్గతం చేసేందుకు ఆన్ని విధాలుగా పోరాడుతున్నారు.

ఈ క్రమంలోనే సునీతను తన తండ్రి హత్య కేసు నుంచి దారి మళ్లించే విధంగా వైఎస్ జగన్ వ్యూహాలు రచిస్తోన్నట్లు పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకోసం పులివెందుల అసెంబ్లీ సీటును వచ్చే ఎన్నికల్లో వైఎస్ సునీతకు కేటాయించబోతున్నారట. పులివెందుల అసెంబ్లీ సీటు ను సునీత కు కేటాయించి తను జమ్ములమడుగు నుంచి పోటీలో దిగేందుకు జగన్ వ్యూహాలు రచిస్తున్నారట. అయితే వైఎస్ సునీత మొదటి నుంచి కూడా రాజకీయాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు. మరి సునీత రాజకీయ ఆరంగేట్రం చేసే అవకాశం ఉందా అంటే సమాధానం చెప్పడం కష్టమే. మరి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య చుట్టూ అలుముకున్న ఈ రాజకీయ చిక్కు ముళ్ళు .. ఎప్పుడు బహిర్గతం అవుతాయో చూడాలి.

Also Read

పార్టీ ప్రకటనకు ముందు కే‌సి‌ఆర్ మాస్టర్ ప్లాన్ !

గ్రామ సచివాలయను రద్దు చేస్తారా ?

యాక్టర్ vs మాస్ లీడర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -