Monday, April 29, 2024
- Advertisement -

జగన్ క సర్పంచులు ఇచ్చే షాక్.. ఎలా ఉంటుందంటే ?

- Advertisement -

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామల్లో చాలానే మార్పులు చోటు చేసుకున్నాయి. వాటిలో ముఖ్యంగా గ్రామ సచివాలయాల ఏర్పాటు, ఇంటింటి రేషన్ పంపిణీ వంటివి చెప్పుకోవచ్చు. అయితే ఇవి ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నప్పటికి.. మారిన మరికొన్ని అంశాలు జగన్ కు తలనొప్పిగా మారే అవకాశం ఉంది. సచివాలయాల ఏర్పాటు తరువాత గ్రామాల్లో చాలా పనులు వాటి ద్వారానే జరుగుతున్నాయి. ప్రభుత్వం కూడా సచివాలయాలకే ప్రదాన్యం ఇస్తూ గ్రామ పంచాయతి వంటి వ్యవస్థలను దాదాపుగా పక్కన పెట్టేసిందనే చెప్పాలి. దీంతో గ్రామ పంచాయతి కేంద్రంగా పాలన సాగించే సర్పంచులకు పని లేకుండా పోయింది.

దాంతో గ్రామాల్లో అభివృద్ది కోసం ప్రజలు ఎన్నుకొన్న సర్పంచులు.. ప్రస్తుతం ప్రేక్షక పాత్ర వహించాల్సి వస్తోంది. ఇక జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామ పంచాయతికి కేటాయించాల్సిన నిధులు అరకొరగానే ఉండడంతో గ్రామాల్లో ఎలాంటి అభివృద్ది పనులు ముందుకు సాగడంలేదు. రోడ్ల సమస్య మొదలుకొని తాగునీటి సమస్య వరకు ఎన్నో సమస్యలు గ్రామాలను వెంటాడుతున్నప్పటికి సర్పంచులు ఏం చేయలేని పరిస్థితి ఉన్నారు. దీనికి ప్రధాన కారణం గ్రామ పంచాయతీల్లో నిధులు లేకపోవడమే. దాంతో రాబోయే రోజుల్లో జగన్ పై సర్పంచుల ఆగ్రహం తప్పదని విశ్లేషకులు చెబుతున్నా మాట. పంచాయతీల్లో నిధులు లేవని అందుకే ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలు చేపట్టలేకపోతున్నామని సర్పంచులు జగన్ సర్కార్ పై అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయినప్పటికి జగన్ సర్కార్ మాత్రం నిధుల విషయంలో జాప్యం చేస్తూ..నిర్లక్ష ధోరణి వ్యవహరిస్తోంది.

దాంతో సచివాలయాలపై ఉన్న ఫోకస్ పంచాయతీలపై ఎందుకు లేదనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇక రాబోయే రోజుల్లో గ్రామ పంచాయతీలను కూడా సచివాలయాలలో కలిపేస్తారా ? అనే అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతి కేంద్రంగా పరిపాలన సాగించే సర్పంచుల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది. గ్రామాల్లో సర్పంచులు బలమైన నాయకులు.. వీరు పార్టీ సింబల్ తో పోటీ చేయకపోయినప్పటికి ఏదైనా పార్టీకి గ్రామస్థాయిలో ఓటు బ్యాంక్ ఏర్పడడంలో ప్రముఖ పాత్ర వహిస్తారు. దాంతో ఇలాంటి సర్పంచుల నుంచి వ్యతిరేకత ఎదురైతే అది వైసీపీకి పెద్ద షాకే చెప్పవచ్చు. ఇక ఇప్పటికే సిపిఎస్ రద్దు విషయంలో జగన్ సర్కార్ పై ప్రభుత్వ ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. ఇప్పుడు పంచాయతి నిధుల విషయంలో సర్పంచుల నుంచి కూడా వ్యతిరేకత ఎదురైతే జగన్ కు వచ్చే ఎన్నికలు గట్టి గుణపాఠం అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read

జగన్ను ఈ విషయంలో మెచ్చుకోవాల్సిందే !

జాతీయ పార్టీకి ఉండే అర్హతలు.. BRS కు ఉన్నాయా ?

ఏపీ మరో నైజీరియా అవుతుందట ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -