జనసేన పార్టీని స్థాపంచిన మొదట్లో ఆశయాలంటూ తెగ ఊదర గొట్టారు పవన్. పార్టీలో యువతకే పెద్దపీట వేస్తానని రాజకీయాలను మారుస్తానని పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన పవన్ వాటన్నింటినీ తుంగలోకి తొక్కేస్తున్నారు. పార్టీలో యువతకే పెద్ద పీట వేస్తామని వారే అనేక సార్లు ప్రకటించారు.
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పవన్ ఆశయాలలో మార్పు వస్తోంది. ఎన్నికల్లో గెలవాలంటే బలమైన అభ్యర్తులు ఏ పార్టీకైనా కశ్చితంగా అవసరం అనేది అందరికీ తెలిసిన విషయమే. అందుకే పవన్ ఇప్పుడు అంగబలం, అర్థబలం ఉన్న బలమైన నాయకులకోసం వేట మొదలు పెట్టారు. వారినే పార్టీలో చేర్చుకొనేందుకు సిద్ధమయ్యారు.
ఇప్పటికే కాపునేతలకు కండువా కప్పిన పవన్ తానింకా బలమైన నాయకుల కోసం అన్వేషిస్తున్నానని చెప్పుకొచ్చారు. యువతను రెచ్చగొట్టే ప్రసంగాలతో మొన్నటివరకు దంచికొట్టిన పవన్ సడన్ గా ఎందుకిలా మారిపోయారనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఎన్నిలంటే సభలను ఏర్పాటు చేసి అభిమానులను ఉత్సాహ పరిచే మాటలు చెప్పడం కాదని పవన్‌కు ఇప్పుడు జ్ణానోదయం అయినట్లుంది. అందుకే గెలుపు గుర్రాలకోసం వెంపర్లాడుతున్నారు. కొత్త వారితో పనికాదనుకున్నారేమోగాని అందుకే ని అనుకుంటున్నారా లేకా పాలిటిక్స్ లో పాతుకుపోయినోళ్లంతా ప్రజల సొమ్ము దోచుకుతినడం అలవాటయిపోయిన వాళ్లని గగ్గోలు పెట్టడం ఎందుకు?
ఇతర పార్టీల్లో నుంచి వచ్చే జంప్ జిలానీల కోసమా, లేక అక్కడ టికెట్ రాదు అని డిసైడ్ అయి ప్లేట్ ఫిరాయించే వాళ్లకోసమా? ఏదేమైనా మొత్తానికి తనకు సరుకు ఉన్నోళ్లు కావాలని ఆయనే బైటపడ్డారు. పవన్ కు నిజంగా తనపై, తన ఆశయాలపై, తన ఇమేజ్ పై అంత నమ్మకం ఉన్నోడయితే ప్రతిచోటా కొత్తవారికి టికెట్లు ఇచ్చి గెలిపించుకోవాలి. అప్పుడు తెలుస్తుంది జనసేన సత్తా ఏంటో? పవన్ స్టామినా ఎంత అనేది.
ఎన్టీఆర్ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చినప్పుడు తెలుగుదేశం తరపున పోటీచేసిన ఎంతోమంది తొలిసారిగా అసెంబ్లీ మెట్లెక్కారు. పేరుగొప్ప సీనియర్లని దారుణంగా ఓడించారు. నిన్నటి వరకు యువతే పార్టీకీ ఆధారం, వాల్లే జనసైనికులని ఊదర గొట్టిన పవన్‌కు అటాంటి ఆశయాలు ఉన్నాయా …?
