Sunday, May 12, 2024
- Advertisement -

ఢిల్లీకి చేరిన తెలంగాణా కాంగ్రెస్ రాజ‌కీయాలు..

- Advertisement -

తెలంగాణాలో ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇక రాజ‌కీయా పార్టీలు ప్ర‌చారం, ఎత్తుకు పైఎత్తులు, పొత్తుల‌తో బిజీగా గ‌డుపుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్తుల‌ను ప్ర‌క‌టించి ప్ర‌చారంలో దూసుకుపోతుంటే విప‌క్షాలు మాత్రం ఆరోప‌న‌ల‌తో కాలం వెల్ల‌దీస్తున్నాయి.

మ‌హాకూట‌మి దిశ‌గా కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, కోద‌రండ‌రామ్ పార్ట‌లు ముందుకు క‌దులుతున్నాయి.కేసీఆర్‌ను ఢీకొట్టాలంటే కూట‌మి త‌ప్ప‌ద‌ని కాంగ్రెస్ ఇప్ప‌టికే నిర్ణ‌యం తీసుకుంది. ఇక అభ్య‌ర్తుల ప్ర‌క‌ట‌న‌పై క‌స‌ర‌త్తు ప్రారంభించింది. టీపీతోతో పొత్తు వ‌ద్ద‌ని కొంద‌రు సీనియ‌ర్ నేత‌లు బ‌హిరంగంగానే వ్య‌తిరేకిస్తున్నారు.

కాంగ్రెస్ ఎన్నిక‌ల అంశం ఇప్పుడు ఢిల్లీకి చేరింది. ఎన్నిక‌ల ప్ర‌చారం, బాధ్య‌త‌లు, అభ్య‌ర్తుల ఎంపిక విష‌యంలో చ‌ర్చించేందుకు ఢిల్లీకి రావాల్సిందిగా అధిష్టానం ఆదేశంచింది. దీంతో 40 మంది కాంగ్రెస్ నేత‌లు ఢిల్లీ వెల్తున్నారు.ఎన్నిక‌ల వ్యూహాల‌ను కూడా చ‌ర్చించేందుకే ఢిల్లీ వెల్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ మహకూటమిలో చేరనుంది. ఈ మేరకు విపక్షాలతో చర్చలు సాగుతున్నాయి. ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఏఏ సీట్లలో పోటీ చేయాలనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. దీంతో అభ్య‌ర్తుల‌ను ప్ర‌క‌టించ‌డం మ‌రికొంత ఆల‌స్యం అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

ఇంకా పొత్తులు ఓ కొలిక్కి రాక‌పోవ‌డంతో సీట్ల పంప‌కాలు ఇంకా ముగియ‌లేదు. విపక్షాల మహా కూటమి మధ్య పొత్తులు, సీట్ల సర్ధుబాటు పూర్తైతే అభ్యర్థుల ప్రకటన సులభమయ్యే అవకాశం ఉంది. పార్టీ ప్రచార కమిటీ ఏర్పాటుతో పాటు ఇతర విషయాలపై చర్చించేందుకు రాహుల్‌గాంధీతో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సెప్టెంబర్ 14వ తేదీ ఉదయం పదిగంటలకు సమావేశంకానున్నారు. ఉత్తమ్ తో పాటు మరో 40 మంది కాంగ్రెస్ పార్టీ నేతలు కూడ ఢిల్లీకి వెళ్లనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -