Sunday, May 19, 2024
- Advertisement -

హీరో శివాజీ లీక్స్ నిజమయినట్టేనా ?

- Advertisement -

ఆపరేషన్ గరుడ రూపం మార్చుకుంటోంది. కొత్త కుట్రతో చంద్రబాబును గద్దె దించడానికి కేంద్రం పావులు కదుపుతోంది. అంతటితో ఆగకుండా అరెస్ట్ కూడా చేస్తారు. బీజేపీ స్వార్ధ రాజకీయాలతో ఏపీ భవిష్యత్ తో ఆడుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం ఏపీ సీఎంకు సహకరించకుండా, ఆయనని ఇబ్బంది పెట్టడం అంటే ఏపీ ప్రజలను ఇబ్బంది పెట్టడమే. సోమవారం చంద్రబాబు అరెస్ట్ కు నోటీసులు వస్తాయి. నేను ఈ విషయాన్ని లీక్ చేసేశాను కాబట్టి. ఓ నాలుగు రోజులు ఆలస్యం కావచ్చు. కానీ నోటీసులు పక్కా…అని హీరో శివాజీ కొద్ది రోజుల క్రితం మీడియా సమావేశంలో చెప్పారు. ఇప్పుడు ఆయన చెప్పిందే జరిగిందా ? చంద్రబాబు అరెస్ట్ తప్పదా ? ఆపరేషన్ గరుడను వేరే రూపంలో కేంద్రం అమలు చేయబోతోందా ? ఇలా అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

శివాజీ చేసిన సంచలన ఆరోపణల నేపథ్యంలో ఎనిమిదేళ్ల క్రితం నాటి కేసులో ఒక్కసారి కూడా నోటీసులు జారీ చేయకుండా, నేరుగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కావడంపై అందరి చూపూ కేంద్రంవైపే పడింది. 2010లో మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా, అప్పటి ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న చంద్రబాబు సహా 40 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు మహారాష్ట్రలో గోదావరి నదిపై నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు. ఆ ప్రాజెక్టు నిర్మాణంతో పాటు పలు ఎత్తిపోతల పథకాల వల్ల గోదావరిలో నీటి ప్రవాహం తగ్గి, ఉత్తర తెలంగాణా ఎడారిగా మారిపోతుందనే ఆందోళన టీడీపీ నేతలు వ్యక్తం చేశారు. తెలంగాణ బోర్డర్ దాటి టీడీపీ నేతల బృందం మహారాష్ట్రలోని ధర్మాబాద్‌కు చేరుకుని ఆందోళన చేపట్టడంతో అక్కడి పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. 14మంది టీడీపీ నేతలపై కేసు నమోదైంది. ప్రజాసమస్యలపై ప్రజాప్రతినిధులు ఇలా ధర్నాలు, ఆందోళనలు, రాస్తారోకోలు, రైల్ రోకోలు, బంద్ లు నిర్వహించడం దేశమంతా నిత్యం జరిగేదే. అయితే ఆ కేసుకు సంబంధించి ఈ ఎనిమిదేళ్లలో ఎలాంటి కదలిక లేదు. సడెన్ గా నిన్న బుధవారం చంద్రబాబు సహా ఆ ధర్నాలో పాల్గొన్న 14మందికి ధర్మాబాద్ కోర్టు నుంచి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. ఈ నెల 21న ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో పాటు మిగతా 14 మందిని కోర్టులో హాజరు పరచాలని ధర్మాబాద్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే గత ఎనిమిదేళ్లుగా ఒక్క నోటీసు కూడా ఇవ్వకుండా, ఇప్పుడు ఒకేసారి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంపై అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఓ ముఖ్యమంత్రిపై ఇలా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంపై అసలేం జరుగుతోందనే చర్చతో రాజకీయాల్లో కలకలం మొదలైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -