Tuesday, May 7, 2024
- Advertisement -

ప‌వ‌న్ కాలుదువ్వుతుంటే.. చంద్ర‌బాబు దువ్వుతున్నాడు

- Advertisement -

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబునాయుడికి.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే వ‌ల్ల‌మాలిన ప్రేమ‌. అందుకే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ చంద్ర‌బాబుతో తెగ‌తెంపుల‌కు ఎంత ప్ర‌య‌త్నించినా.. చంద్ర‌బాబు మాత్రం వ‌దులుకునేందుకు ఇష్ట‌ప‌డ‌రు. ఈ విష‌యం అనేకసార్లు నిరూప‌ణ అయింది కూడా. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌తిసారీ త‌న‌కు కోపం రాగానే.. చంద్ర‌బాబు, ఆయ‌న ప్ర‌భుత్వం, చివ‌రికి కొడుకు లోకేష్‌పైనా విరుచుకుప‌డుతుంటారు. కానీ.. చంద్ర‌బాబు మాత్రం త‌న శ్రేణుల‌ను క‌ట్ట‌డి చేస్తూ.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ విష‌యంలో తొంద‌ర‌ప‌డి స్టేట్‌మెంట్లు ఇవ్వొద్దంటూ వారిస్తుంటారు. గ‌త ఆరేడు నెల‌లుగా గుంటూరు జ‌న‌సేన స‌భ నుంచి ప‌వ‌న్ క‌ళ్యాణ్ చంద్ర‌బాబునాయుడిపై తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేస్తూ వ‌స్తున్నారు. వివాదం ఉన్నా.. లేక‌పోయినా.. చంద్ర‌బాబు, ఆయ‌న ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డుతున్నారు. త‌న దైన సినీ స్టైల్‌లో డైలాగులు చెబుతూ.. మంత్రుల అవినీతి, ప్ర‌భుత్వ పాల‌న‌, స‌మ‌స్య‌ల‌పై తీవ్ర ప‌ద‌జాలంతో ప‌వ‌న్ విమ‌ర్శ‌ల‌ను గుప్పిస్తూ వ‌స్తున్నారు. అయినా.. చంద్ర‌బాబు ప‌వ‌న్ విష‌యంలో పెద్ద సీరియ‌స్‌గా ఎప్పుడూ రియాక్ట్ కాలేదు. ఎప్ప‌టికైనా మ‌ళ్లీ ప‌వ‌న్ మ‌ద్ద‌తు త‌మ‌కు అవ‌స‌ర‌మే ఏకైక కార‌ణంతోనే చంద్ర‌బాబు ఇంత సౌమ్యంగా, సామ‌ర‌స్య‌పూర్వ‌కంగా జ‌న‌సేనాని విష‌యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే.

తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా చంద్ర‌బాబునాయుడు మ‌ళ్లీ ప‌వ‌న్‌ను దువ్వె ప‌నిని ఆరంభించిన‌ట్టు క‌న్పిస్తోంది. ఒక‌వైపు చంద్ర‌బాబు స‌ర్కారుపై ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాలుదువ్వి మ‌రీ ఆరోప‌ణ‌లు చేస్తుంటే.. చంద్ర‌బాబు న‌వ్వుతూ ప‌వ‌న్‌ను దువ్వే ప‌నిని చేప‌ట్టారు. ప‌వ‌న్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ట్విట‌ర్ ద్వారా చంద్ర‌బాబు శుభాకాంక్ష‌లు తెలిపారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆరోగ్యంగా ఉండాల‌ని కోరుకుంటున్న‌ట్టు చంద్ర‌బాబు ట్వీట్ చేశారు. ఆయ‌న కుమారుడు ఏపీ ఐటీ మంత్రి లోకేష్ కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. భ‌విష్య‌త్తులో ఇలాంటి మ‌రిన్ని వేడుకలు ఆనందంగా జ‌రుపుకుని సంతోషంగా ఉండాల‌ని కోరుకుంటున్నానంటూ లోకేష్ ట్విట‌ర్ ద్వారా తెలిపారు. నిజానికి.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, చంద్ర‌బాబు మ‌ధ్య గ‌త ఆరేడు నెల‌లుగా ఆరోప‌ణ‌లు, ఆవేద‌న‌లే త‌ప్ప‌.. ఇలాంటి ఆనందాలు పంచుకోవ‌డం అనేది లేదు.

చంద్ర‌బాబునాయుడు పవ‌న్ క‌ళ్యాణ్ ఆరోప‌ణ‌ల‌పై స్పందించ‌కుండా త‌న‌వారిని కంట్రోల్ చేసి ఆపుతున్నా.. అప్పుడ‌ప్పుడూ వేదిక‌ల పైనుంచి ఆయ‌నే స్వ‌యంగా ప‌వ‌న్‌ను మోడీ తొత్తుగా అభివ‌ర్ణిస్తూ ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. కావాల‌ని రాష్ట్రంలో పాల‌న‌పై బుర‌ద‌జ‌ల్లేందుకు వై.ఎస్‌.జ‌గ‌న్‌తో పాటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా మోడీ డైరెక్ష‌న్‌లో ప‌నిచేస్తున్నాడంటూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఆ విమ‌ర్శలు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంత కోపంగా, తీవ్ర ప‌ద‌జాలంలో ఉండ‌డం లేదంతే. అలాంటిది ఇప్పుడు ఒకేసారి ప‌వ‌న్ పుట్టిన‌రోజు వేడుక వేదిక‌గా.. చంద్ర‌బాబు మ‌ళ్లీ ప‌వ‌న్‌పై ప్రేమ‌ను కురిపించారు. అయితే.. మిత్రుడైనా, శ‌త్రువైనా.. శుభాకాంక్ష‌లు చెప్పుకోవ‌డం స‌ర్వ‌సాధార‌ణ‌మే అయినా.. ప‌వ‌న్ విష‌యంలో చంద్ర‌బాబు ట్వీట్ మాత్రం.. మిత్రుడిని క‌లుపుకుపోవాల‌నే ధోర‌ణిలోనే క‌న్పిస్తోందంటూ రాజ‌కీయ విశ్లేష‌కులు సైతం అంటుండ‌డం గ‌మ‌నార్హం. ఏమో.. రాజ‌కీయాల్లో శాశ్వ‌త మిత్రులు.. శాశ్వ‌త శ‌త్రువులు అంటూ ఎవ‌రూ ఉండ‌రు. ఉన్న‌దంతా అవ‌స‌రాలు.. దానికి త‌గ్గ మిత్రులే. అందుకే ఎన్నిక‌ల స‌మ‌యానికి మ‌ళ్లీ ప‌వ‌న్‌, చంద్ర‌బాబు ఒక్క‌ట‌వ్వ‌ర‌నే గ్యారెంటీ ఏముంది. అలాగైతే.. ఈ తాజా శుభాకాంక్ష‌ల ట్వీట్ వృథా పోన‌ట్టే లెక్క‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -