ప్రశ్నిస్తానని జనసేన పార్టీ పెట్టి ప్రజల్లోకి వచ్చిన పవన్ రాజకీయ అజ్ఞానంతో మాట్లాడి ప్రజల్లో, రాజకీయ నాయకుల్లో నవ్వుల పాలవుతున్నారు. ఎక్కడైనా అధికార పార్టీనీ ప్రశ్నిస్తారు కాని ఆంధ్రలో మాత్రం ప్రతిపక్షం వైసీపీనీ విమర్శించడం జనసేనకు అలవాటుగా మారింది. 2014 ఎన్నికల్లో భాజాపా-టీడీపీ ఇచ్చిన హామీలకు నేను బాధ్యత తీసుకుంటానని గొప్పలు చెప్పుకున్న పవన్ ఇప్పుడు ఆ బాధ్యత తీసుకుంటారా అంటే …దానిపై మాట్లాడడు.
ఇక అసలు విషయానికి వస్తే పవన్ ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడతారో ఆయనకే తెలియదు. ఒక సభలో మాట్లాడిన మాటలు ఇంకో సభలో కనిపించవు. పొంతనలేని మాటలు మాట్లాడటం రాజకీయాల్లో నవ్వుల పాలవ్వడం పరిపాటిగా మారింది.
ఒక పక్కేమో తనను సీఎం ను చేయమని ప్రజలను అడుగుతాడు. అదే జగన్ సీఎం అనుకోవాలనుకుంటే మాత్రం తప్పు. ఎవరు ఔనన్నా, రాజకీయం అంటేనే డబ్బుతో పని. రాజకీయాల్లోకి వస్తే పార్టీనీ అధికారంలోకి తీసుకొచ్చి ప్రజలకు సేవ చేద్దామని వస్తారు. డబ్బు కోసం కాక, పదవికోసం కాక.. జనాన్ని ఉద్ధరించేస్తామంటే నమ్మే స్థితిలో ఎవరూలేరు. జగన్ డైర్టుగా నేను సీఎం అయితే ప్రజల సమస్యలను తీరుస్తానని మగాడీగ ప్రకటించారు. కాని పవన్ మాత్రం దొంకతిరుగుడు మాటలు మాట్లాడుతుంటారు.
కాంగ్రెస్‌లో వుండగానే, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ముఖ్యమంత్రి పదవికి సంబంధించి ‘బంపర్ ఆఫర్’ వచ్చిన మాట వాస్తవం. వైఎస్ మరణానంతరం, 150 మంది ఎమ్మెల్యేలు, జగన్ ముఖ్యమంత్రి అవ్వాలంటూ నినదించారు.. సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో జగన్ ముఖ్యమంత్రి పదవిని కాదనుకున్నారు.
పదే పదే, ఒకటికి వందసార్లు.. ‘ముఖ్యమంత్రి పదవి తప్ప, జగన్‌కి ఇంకో ఆలోచన లేదు..’ అంటూ పవన్‌కళ్యాణ్, పొలిటికల్ డైలాగులు పేల్చుతూ, వైఎస్సార్సీపీ అధినేత మీద విరుచుకుపడ్తున్నారు. జగన్, గతంలో ఎంపీగా పనిచేశారు. ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నేతగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి పదవి ఆశిస్తే తప్పేంటని ప్రజలు కూడా సపోర్టుగా నిలుస్తున్నారు.
పాదయాత్ర పేరుతో నిరంతనం ప్రజల్లో జగన్ ఉంటున్నారు. పాదయాత్రలో ప్రజల సమస్యలను తెలుసుకుంటా వారికి నేనున్నాని భరో సా ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక పవన్ విషయానికి వస్తే ఇన్నాల్లు పవన్‌కళ్యాణ్ ఏం చేస్తున్నట్లు.? ఇంకా పార్టీ నిర్మాణమే జరగలేదాయె. జనసేన పోరాటయాత్ర పేరుతో.. అప్పుడప్పుడూ ‘విహార యాత్రలు’ చేస్తున్నారాయన. పవన్ వెర్రితనంగాని ముఖ్యమంత్రి అనే పదవిని ప్రజలు నిర్ణయిస్తారు. పవన్ వెటకారం చేశాడని జగన్‌కి ముఖ్యమంత్రి పదవి రాకుండా పోతుందా…?
