Thursday, May 2, 2024
- Advertisement -

బాబుకు పొంచి ఉన్న కోడి క‌త్తి గండం…?

- Advertisement -

కోడి క‌త్తి కేసు అటు తిరిగీ ఇటుతిరిగీ టీడీపీ మెడ‌కు చుట్టుకుంటోంది. జ‌గ‌న్‌పై దాడి జ‌రిగిన త‌ర్వాత సీఎం చంద్ర‌బాబు, డీజీపీ, మంత్రులు మాట్లాడిన అనాలోచిత వ్యాఖ్య‌ల కార‌నంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మెడపై రాజకీయంగా వేటు వేసేలానే కన్పిస్తోంది.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మీద విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నాన్ని ‘పబ్లిసిటీ స్టంట్‌’గా టీడీపీ కొట్టిపారేస్తూ వస్తోన్న విషయం విదితమే. ముఖ్యమంత్రి చంద్రబాబు, డీజీపీ ఠాకూర్‌, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప.. ఇలా ప్రభుత్వంలో అతి ‘ముఖ్యులు’ మొదటిరోజు, మొదటి రెండు మూడు గంట‌ల్లోనే ఘ‌ట‌న‌ను నీరుగార్చే విధంగా మాట్లాడారు.

అయితే ఇప్పుడ అదే కోడి క‌త్తి టీడీపీ మెడ‌కు చుట్టుకుంటోంది. ఈ ఘ‌ట‌న‌ను తేలిగ్గా తీసుకుంటారులే అని అనుకున్న టీడీపీ నాయ‌కుల‌కు వైసీపీ నేత‌లు షాక్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ధ‌ర్డ్ పార్టీ చేత విచార‌న జ‌రిపించాల‌ని హైకోర్టులో కేసు వేడ‌యం బాబుతో పాటు 8 మందికి కోర్టు నోటీసులు జారీ చేసింది.

దాడి ఘ‌ట‌న వెనుక కుట్ర‌రోణం దాగుంద‌ని..అదే తృటిలో ప్రాణాపాయం తప్పిందిగానీ, లేదంటే జరగరాని ఘోరం జరిగిపోయేదేనని సాక్షాత్తూ వైఎస్‌ జగన్‌ తల్లి విజయమ్మ ఆవేదన వ్యక్తంచేశారు. ఇటు వైఎస్సార్సీపీ అనుమానాలు, అటు న్యాయస్థానం నోటీసులు.. వెరసి, అధికార పార్టీ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయ్యింది పరిస్థితి.

మామూలుగా అయితే ఇలాంటి కేసుల్ని ‘మమ’ అన్పించేయడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య. కాని వైసీపీ నేత‌లు మాత్రం ఈ ఘ‌ట‌న‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెల్ల‌డంలో స‌క్సెస్ అయ్యారు. అంతే కాదు జాతీయ స్థాయిలో ప్ర‌సిడెంట్ వ‌ద్ద‌కు వెల్లింది ఫిర్యాదు.

‘ఎ1 నిందితుడు చంద్రబాబే’ అని వైసీపీ ఆరోపిస్తోంది. దాడి ఎవరు చేశారు.? ఎందుకు చేశారు.? అన్న విషయాలు విచారణలో తేలతాయేమోగానీ.. ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే.. నిర్లక్ష్యంగా మాట్లాడిన పాపానికి, చంద్రబాబు అండ్‌ టీమ్‌.. ప్రజాకోర్టులో శిక్ష అనుభవించక తప్పేలాలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -