Saturday, May 3, 2025
- Advertisement -

ఒక్క ఛాన్స్ అంటే నమ్మి.. మోసపోయాం !

- Advertisement -

వచ్చే ఎన్నికల లక్ష్యంగా ఏపీలో జనసేన పార్టీ దూకుడు చూపిస్తోంది. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ నిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీని బలోపేతం చేయడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. పవన్ చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజల్లో నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక రోజురోజుకి జనసేన కు జనధారణ పెరుగుతుండడంతో జనసేనాని మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు.

ఏ ఛిన్న అవకాశం దొరికిన వైసీపీ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తూ ప్రజల దృష్టిని తనవైపు తిప్పుకుంటున్నారు పవన్. ఇక ఈ మద్య సి‌ఎం జగన్ ప్రతి సభలో కూడా ప్రజలకు మంచి చేశామని, గతంలో ఏ ప్రభుత్వం అందించని విధంగా సుపరిపాలన అందిస్తున్నామని అందువల్ల తమ ప్రభుత్వం మంచి చేశామని అనిపిస్తే మళ్ళీ ఆశీర్వధించాలని, తిరిగి వైసీపీ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో కూడా అధికారం కల్పించాలని జగన్ చెబుతూ వస్తున్నారు.

ఇలా సి‌ఎం జగన్ చేస్తున్న వ్యాఖ్యలపై జనసేన పార్టీ సెటైర్ల వర్షం కురిపిస్తోంది. ట్విట్టర్ లో ఓ కార్టూన్ ఫోటోను పోస్ట్ చేస్తూ.. ” ఒక్క ఛాన్స్ అంటే నమ్మి నిలువునా మోసపోయామని..ఇక నమ్మేదే లేదంటూ ” జగన్ వ్యాఖ్యలపై సెటైరికల్ కామెంట్స్ పోస్ట్ చేసింది జనసేన. ఇక జనసేన చేసిన పోస్ట్ పై నెటిజన్స్ బిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. గత ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయాం ఇప్పుడు లబ్ది పొందుతున్నాం అని కొందరు వైసీపీ ప్రభుత్వాన్నికి అనుకూలంగా కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరేమో ఇక వైసీపీ ని నమ్మే ప్రసక్తే లేదని కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి గత కొన్ని రోజులుగా వైసీపీ సోషల్ మీడియాలో జగన్ సర్కార్ ను విమర్శిస్తూ జనసేన పోస్టు చేస్తున్న కార్టూన్ ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

“లిక్కర్ క్వీన్” కవిత.. జైల్ కు వెళ్ళక తప్పదా ?

బాబుకి పోలవరం చూసే హక్కు లేదా !

ఏపీలో మోడీ దోస్తీ ఎవరితో..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -