Thursday, May 2, 2024
- Advertisement -

“లిక్కర్ క్వీన్” కవిత.. జైల్ కు వెళ్ళక తప్పదా ?

- Advertisement -

తెలంగాణ సి‌ఎం కే‌సి‌ఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చుట్టూ గత కొన్ని రోజులుగా లిక్కర్ స్కామ్ ఆరోపణలు ఎదురుకొంటున్న సంగతి తెలిసిందే. డిల్లీ కేంద్రంగా జరిగిన ఈ లిక్కర్ స్కామ్ లో కవిత కూడా ఇన్వల్వ్ అయి జ్మ్దని బీజేపీ నేతలు మొదటి నుంచి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కవితా ఈడీ కేసులు ఎదుర్కొనే అవకాశ ఉందని, ఆమె జైల్ కు వెళ్ళాక తప్పదని కమలనాథులు చెబుతూ వస్తున్నారు. ఇక తాజాగా తాజాగా లిక్కర్ స్కామ్ లో కవిత పేరు కూడా చేర్చింది ఈడీ. లిక్కర్ స్కామ్ లో 100 కోట్ల ముడుపులు చేతులు మరాయని, ఈ కుంభకోణంలో సౌత్ గ్రూప్ నుంచి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, శరత్ రెడ్డి, వైసీపీ ఎంపీ మాగుంట బాధ్యత వహించారని ఈడీ విడుదల చేసిన నోటీసులో పేర్కొంది.

దీంతో ఒక్కసారిగా ఈ వార్త సంచలనంగా మారింది. ఇక లిక్కర్ స్కామ్ లో కవితా పేరు చేర్చడంపై ఆమె స్పందిస్తూ, ఇదంతా బీజేపీ చేస్తున్న కుట్ర అని, వీటిని ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నామని కవితా చెప్పుకొచ్చింది. అయితే ఈడీ సౌత్ గ్రూప్, మొబైళ్ళ ధ్వంసం, రూ.100 కోట్లు సమకూర్చడం వంటి అంశాలపై కవితా ఏ మాత్రం స్పందించలేదు. కేవలం రాజకీయ పరంగా మాత్రమే వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలు వచ్చే ఏడాది జరగనుండడంతో ఈడీ కేసులు రావడం సహజం అని, చాలా రాష్ట్రాలలో కూడా మొదట ఈడీ తరువాత మోడీ వస్తున్నారని, ఈడీని అడ్డు పెట్టుకొని తెలంగాణలో గెలవడం సాధ్యం కాదని, తనపైనా టి‌ఆర్‌ఎస్ మంత్రులపైనా ఈడీ పేరుతో బిజెపి చేస్తున్న నీచమైన రాజకీయ ఎత్తుగడఅని వీటికి బయపడే ప్రసక్తే లేదని కల్వకుంట్ల కవిత చెప్పుకొచ్చారు.

ఇక ఈడీ విచారణకు సహకరిస్తానని, మహా అయితే ఏం చేస్తారు ? జైల్లో పెడతారు.. పెట్టుకోండి అంటూ కవిత ఘాటుగా స్పందించారు. అయితే లిక్కర్ స్కామ్ లో కవితా నిందితురాలిగా కన్ఫర్మ్ కావడంతో గులాబీ బస్ తదుపరి ప్లాన్ ఏంటి అనేది ఇప్పుడు పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ హాట్ గా నడుస్తున్న చర్చ. మునుగోడు ఎన్నికల వేల బిజెపి అమలు చేసిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యూహాన్ని పటాపంచలు చేసిన కే‌సి‌ఆర్.. బీజేపీకి షాక్ ఇచ్చిన కే‌సి‌ఆర్.. ఇప్పుడు తన కూతురు ఈడీ కేసులో భాగంగా ఎలా స్పందిస్తారు ? తిరిగి బీజేపీ వ్యూహాలకు ఎలా చెక్ పెడతారు అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి లిక్కర్ స్కామ్ లో కవితా పేరు తెరపైకి రావడంతో ” లిక్కర్ క్వీన్ ” అంటూ సోషల్ మీడియా లో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

చంద్రబాబుకు బెదిరింపులా.. నో ఛాన్స్ !

పొత్తులను నమ్ముకోలేదు: సి‌ఎం జగన్

ఏపీలో మోడీ దోస్తీ ఎవరితో.. లైన్లో ముగ్గురు అధినేతలు !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -