Friday, May 3, 2024
- Advertisement -

బాబుకి పోలవరం చూసే హక్కు లేదా !

- Advertisement -

ఏపీలోని పోలవరం ప్రాజెక్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాజెక్ట్ కోసం ఏపీ ప్రజలు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. అయితే ఎన్ని ప్రభుత్వాలు మారుతున్న ప్రాజెక్ట్ మాత్రం పూర్తి కావడం లేదు. గత ప్రభుత్వ హయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాజెక్ట్ నిర్మాణ పనులను వేగంగా పరుగులు పెట్టించినప్పటికి.. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత అసలు ప్రాజెక్ట్ పనుల గురించిన ప్రస్తావనే లేకపోయింది. గతంలో ఇరిగేషన్ మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ 2021 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవుతుందని కుండ బద్దలు కొట్టినట్లు అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. .

కానీ తన హామీని నిలబెట్టుకోకుండానే మంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. ఇక ప్రస్తుతం ఇరిగేషన్ మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు పోలవరం నిర్మాణా పనులకు సంబంధించి స్పష్టమైన సమాచారం ఇచ్చిన దాఖలలే లేవు. ఈ నేపథ్యంలో పోలవరం విషయంలో వైసీపీ నిలక్ష్యాన్ని ఎత్తి చూపే ప్రయత్నంలో ఉన్నారు చంద్రబాబు. ఆయన తాజాగా ఉబయగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం చేరుకున్న చంద్రబాబు ప్రాజెక్ట్ వద్దకు వెళ్ళే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డగించారు. ప్రాజెక్ట్ వద్దకు వెళ్ళేందుకు ఎవరికి అనుమతి లేదని పోలీసులు అడ్డగించడంతో.. చంద్రబాబు ఆగ్రహంతో ఎందుకు అనుమతి ఇవ్వారంటూ అక్కడే నిరసనకు దిగారు.

దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాను ప్రారంభించిన ప్రాజెక్ట్ ను చూడడానికి తనకే అవకాశం ఇవ్వరా అంటూ వంగ్వాదానికి దిగారు చంద్రబాబు. ప్రాజెక్ట్ ను ఏ విధంగా నాశనం చేశారో ప్రజలు చెప్పాలనే ఇక్కడికి వచ్చానని, కమిషన్ల కోసం డబ్బు కోసం ప్రాజెక్ట్ ను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నాశనం చేసిందని చంద్రబాబు మండి పడ్డారు. మూడేళ్లలో కేవలం 3 శాతం పనులు కూడా పూర్తి కాలేదని, ఇది రాష్ట్రనికి జరిగిన అతి పెద్ద నష్టం అని బాబు వాపోయారు. అయితే చంద్రబాబుకు నక్సల్స్ ముప్పు ఉందని అందుకే అనుమతి ఇవ్వడం లేదని పోలీసులు చెబుతున్నారు. మొత్తానికి పోలవరం ప్రాజెక్ట్ ను చూడడానికి కూడా చంద్రబాబుకు అనుమతి ఇవ్వకపోవడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే. అయితే పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి తప్పులు జరగనప్పుడు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని టిడిపి శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి

షర్మిలతో బీజేపీ దోస్తీ కోరుకుంతోందా ?

“బటన్ నొక్కుడు “.. ఇదేం పాలనరయ్యా !

రాజకీయాల్లో పవన్ జోకరా.. కింగ్ మేకరా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -